అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

యాంకర్‌గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు, జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbai).

Update: 2025-03-16 07:09 GMT
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్‌గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు, జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbai). ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్‌(Bharath)లు తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రానుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి ఎవరినో నవ్వుతూ చూస్తున్నారు. అయితే వీరి వెనకాల గెటప్ శ్రీనుతో పాటు మరికొందరు కమెడియన్స్ కత్తులు పట్టుకుని వీళ్లను నరకడానికి అన్నట్లు దూసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.



Tags:    

Similar News