బీజేపీ వ్యాక్సిన్ తీసుకోను: అఖిలేశ్
లక్నో: దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండగా ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ వ్యాక్సిన్’గా పేర్కొంటూ దానిపై తమకు నమ్మకం లేదన్నారు. వ్యాక్సిన్‌ను ఎలా నమ్మగలం. అదీ బీజేపీ పార్టీ ఇస్తున్నది. బీజేపీ వ్యాక్సిన్‌ను మేం తీసుకోవాలని అనుకోవడం లేదు. 2022లో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా ఇస్తామని అఖిలేశ్‌యాదవ్ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ అధినేత వ్యాఖ్యలపై […]
లక్నో: దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండగా ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ వ్యాక్సిన్’గా పేర్కొంటూ దానిపై తమకు నమ్మకం లేదన్నారు. వ్యాక్సిన్‌ను ఎలా నమ్మగలం. అదీ బీజేపీ పార్టీ ఇస్తున్నది. బీజేపీ వ్యాక్సిన్‌ను మేం తీసుకోవాలని అనుకోవడం లేదు.
2022లో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా ఇస్తామని అఖిలేశ్‌యాదవ్ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ అధినేత వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. దేశ శాస్త్రవేత్తలను, వైద్యులను అఖిలేశ్ యాదవ్ అవమానిస్తున్నారని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాక్సిన్‌పై అఖిలేశ్ యాదవ్‌కు నమ్మకం లేనట్లే, ఆయనపై కూడా యూపీ ప్రజలకు నమ్మకం లేదన్నారు.