ఎమ్మెల్యే ‘రసమయి’ రాజీనామా చేయాల్సిందే..

దిశ, మానకొండూరు : మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రాజీనామా చేస్తే నియోజక వర్గం అభివృద్ధి చెందుతుంది. నియోజక వర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు కావాలంటే రసమయి రాజీనామా చేయాలని ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్ డిమాండ్ చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో యుగంధర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని అన్నారు. కుల సంఘాలకు భవనాలు, డబుల్ […]

Update: 2021-08-14 08:54 GMT
rasamai-Balakishan
  • whatsapp icon

దిశ, మానకొండూరు : మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రాజీనామా చేస్తే నియోజక వర్గం అభివృద్ధి చెందుతుంది. నియోజక వర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు కావాలంటే రసమయి రాజీనామా చేయాలని ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్ డిమాండ్ చేశారు.

శనివారం విలేకరుల సమావేశంలో యుగంధర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని అన్నారు. కుల సంఘాలకు భవనాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బంధు, రోడ్లు, యువతకు అనేక హామీలు ఇస్తున్నారు. మహిళలకు సంఘ భవనాలు కేటాయిస్తూ ప్రతీ గ్రామంలో ఒక కొత్త నిర్మాణం చేస్తూ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.

గత ఏడేళ్లుగా మానకొండూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని అన్నారు. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలంటే.. ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Tags:    

Similar News