భారీగా పెరిగిన ఎయిర్‌టెల్ లాభాలు.. ఎంతంటే!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,134 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో వచ్చిన రూ.283 కోట్లతో పోలిస్తే 300 శాతం పెరగడం విశేషం. గతేడాది ఇదే కాలంలో రూ.763.2 కోట్ల ఎయిర్‌టెల్ నష్టాలను నమోదు చేసింది. ఇక సమీక్షించిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్ కార్యకలాపాల ఆదాయం గతేడాది కంటే 18.8 శాతం పెరిగి రూ.28,326.4 కోట్లకు చేరింది. ఎబిటాకు ముందు కంపెనీ ఆదాయం […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,134 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో వచ్చిన రూ.283 కోట్లతో పోలిస్తే 300 శాతం పెరగడం విశేషం. గతేడాది ఇదే కాలంలో రూ.763.2 కోట్ల ఎయిర్‌టెల్ నష్టాలను నమోదు చేసింది. ఇక సమీక్షించిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్ కార్యకలాపాల ఆదాయం గతేడాది కంటే 18.8 శాతం పెరిగి రూ.28,326.4 కోట్లకు చేరింది. ఎబిటాకు ముందు కంపెనీ ఆదాయం 24.5 శాతం పెరిగి రూ.14,018 కోట్లకు చేరుకుందని తెలిపింది.
‘దేశీయంగా 4జీ వినియోగదారులు గణనీయంగా పెరగడం, ఆర్పు పెరుగుదల కారణంగా సంస్థ మెరుగైన ఆదాయాలను సాధించగలిగిందని’ ఎయిర్‌టెల్ సీఈఓ, ఎండీ గోపాల్ విట్టల్ తెలిపారు. వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) గతేడాది రూ.143 నుంచి రూ.153కి పెరిగిందని, వినియోగదారుల సంఖ్య 35.5 కోట్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది. దేశీయ మార్కెట్లో కంపెనీ 4జీ వినియోగదారులకు సంబంధించి బలమైన వాటాను కలిగి ఉంది. 4జీ డేటా వినియోగదారులు ఏడాది కాలంలో 26.1 శాతం పెరిగి 19.25 కోట్లకు చేరారని కంపెనీ తెలిపింది.