ఆకట్టుకుంటున్న కొత్త అన్ లిమిటెడ్ ఆఫర్
దిశ వెబ్ డెస్క్: జియో దెబ్బకు టెలికం కంపెనీలు గింగిరాలు కొడుతున్నాయి. అందుకే మార్కెట్లో నిలదొక్కు కోవాలంటే జియోకు పోటీగా ఆఫర్ల బాట పట్టాల్సిందేని పలు కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే తాజాగా తన కస్టమర్ల కోసం ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఏయిర్ టెల్ ఓ బంపర్ ఆఫర్‌ను తీసుకు వచ్చింది. తన పాత బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు అన్ లిమిటెడ్ డాటా బెనిఫిట్స్ కల్పించనున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. ఈ కొత్త ఆఫర్‌ను బేసిక్, ఎంటర్ […]
దిశ వెబ్ డెస్క్: జియో దెబ్బకు టెలికం కంపెనీలు గింగిరాలు కొడుతున్నాయి. అందుకే మార్కెట్లో నిలదొక్కు కోవాలంటే జియోకు పోటీగా ఆఫర్ల బాట పట్టాల్సిందేని పలు కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే తాజాగా తన కస్టమర్ల కోసం ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఏయిర్ టెల్ ఓ బంపర్ ఆఫర్‌ను తీసుకు వచ్చింది. తన పాత బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు అన్ లిమిటెడ్ డాటా బెనిఫిట్స్ కల్పించనున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. ఈ కొత్త ఆఫర్‌ను బేసిక్, ఎంటర్ టైన్ మెంట్‌తో పాటు అన్ని రకాల చందాదారులకు వర్తింప చేసింది.
కాగా తన పాత వినియోగదారుల కోసం జియో రూ.399 ప్లాన్ తీసుకువచ్చింది. దీంతో ఎక్కువ మంది వినియోగ దారులు జియో ఫైబర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది . దీంతో తన వినియోగదారులు జియోకు వెళ్లకుండా ఉండేందుకు ఎయిర్ టెల్ కూడా అన్ లిమిటెడ్ ప్లాన్ తీసుకువచ్చింది. కాగా కొత్త ప్లాన్ లో భాగంగా బేసిక్ ప్లాన్ 299ను తొలగించింది. ఇంకా తన ఎక్స్ ట్రీమ్ ఫైబర్ బ్రాండ్ వినియోగదారులకు ప్రైమ్ వీడియో బెన్ ఫిట్ తొలగించింది. ఈ కొత్త అన్ లిమిటెడ్ ప్లాన్ ఏపీ, గుజరాత్ సర్కిళ్లలో ఇస్తోంది. ఈ ప్లాన్ కింద 3300జీబీ డాటాను వినియోగదారులకు అందించ నుంది. ఒక వేళ డాటా వినియోగం పూర్తయితే ఎంబీపీఎస్ వేగంతో డాటాను అందిస్తోంది.