రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య ముగిసిన స్పెక్ట్రమ్ విక్రయం

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య కీలక ఒప్పందం ముగిసిందని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఎయిర్‌టెల్ సంస్థకు మూడు సర్కిళ్లలో 800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌లను రిలయన్స్ జియోకు విక్రయించే ఒప్పందం శుక్రవారం ముగిసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ఈ మూడు సర్కిళ్లలోని స్పెక్ట్రమ్‌ను బదిలీ చేసేందుకు జియోతో జరిగిన వాణిజ్య ఒప్పందం ముగిసిందని వివరించింది. ప్రస్తుత ఏడాది ప్రారంభంలో ఎయిర్‌టెల్‌కు చెందిన 800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను జియోకు […]

Update: 2021-08-13 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య కీలక ఒప్పందం ముగిసిందని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఎయిర్‌టెల్ సంస్థకు మూడు సర్కిళ్లలో 800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌లను రిలయన్స్ జియోకు విక్రయించే ఒప్పందం శుక్రవారం ముగిసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ఈ మూడు సర్కిళ్లలోని స్పెక్ట్రమ్‌ను బదిలీ చేసేందుకు జియోతో జరిగిన వాణిజ్య ఒప్పందం ముగిసిందని వివరించింది. ప్రస్తుత ఏడాది ప్రారంభంలో ఎయిర్‌టెల్‌కు చెందిన 800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను జియోకు విక్రయించేందుకు వాణిజ్య ఒప్పందం ఇరు సంస్థలు కుదుర్చుకున్నాయి. ఏపీ, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలోని ఎయిర్‌టెల్‌కు చెందిన స్పెక్ట్రమ్‌ను జియో దక్కించుకోనుంది. ఈ ఒప్పందం ప్రకారం.. జియో సంస్థ ఎయిర్‌టెల్‌కు రూ. వెయ్యి కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. అలాగే, జియో అదనంగా స్పెక్త్రమ్ బాధ్యతలు పొందేందుకు రూ. 460 కోట్లకు పైగా ఎయిర్‌టెల్‌కు చెల్లించనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నియంత్రణ చట్టాలకు లోబడి ఈ స్పెక్ట్రమ్ అమ్మేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమైంది.

Tags:    

Similar News