ప్రాణాంతకంగా వాయు కాలుష్యం

న్యూఢిల్లీ: వాయుకాలుష్యం ప్రాణాంతకంగా పరిణమించింది. ఇప్పటికే ఉనికిలో ఉన్న పలురకాల వైరస్‌లు, వ్యాధులకు అదనంగా ఎయిర్ పొల్యూషన్ సీరియస్ కిల్లర్‌గా మారినట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య ప్రభావాలపై తొలిసారిగా రూపొందించిన సమగ్ర నివేదిక ప్రకారం, దీర్ఘకాలం వాయుకాలుష్యానికి గురవడం కారణంగా గతేడాది భారత్‌లో సుమారు 16,67,000ల మంది వివిధ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో శిశువుల మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. కాలుష్యం కారణంగా నెలలోపు కన్నుమూస్తున్న శిశువుల సంఖ్య […]

Update: 2020-10-21 09:51 GMT

న్యూఢిల్లీ: వాయుకాలుష్యం ప్రాణాంతకంగా పరిణమించింది. ఇప్పటికే ఉనికిలో ఉన్న పలురకాల వైరస్‌లు, వ్యాధులకు అదనంగా ఎయిర్ పొల్యూషన్ సీరియస్ కిల్లర్‌గా మారినట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య ప్రభావాలపై తొలిసారిగా రూపొందించిన సమగ్ర నివేదిక ప్రకారం, దీర్ఘకాలం వాయుకాలుష్యానికి గురవడం కారణంగా గతేడాది భారత్‌లో సుమారు 16,67,000ల మంది వివిధ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

ఇందులో శిశువుల మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. కాలుష్యం కారణంగా నెలలోపు కన్నుమూస్తున్న శిశువుల సంఖ్య 1,16,000 ఉన్నట్టు హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 రిపోర్టు తెలిపింది. గాలి కాలుష్యానికి దీర్ఘకాలం ఎక్స్‌పోజ్ కావడంతో స్ట్రోక్, హార్ట్ అటాక్, డయాబెటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ లంగ్ డిసీజ్, నవజాత శిశువుల మరణాలు జరుగుతున్నాయని పేర్కొంది. తక్కువ బరువుతో జన్మించడం, తొమ్మిది నెలలకు ముందే ప్రసవం కావడం లాంటి సమస్యలకు వాయు కాలుష్యం కారణమవుతున్నదని వివరించింది.

Tags:    

Similar News