ఎయిర్ ఇండియా ఉద్యోగులకు మరింత గడువు

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ ఇండియా తమశాశ్వత ఉద్యోగులు వేతనం లేని సెలవును లేదా తక్కువ పనిదినాలు చేసి 60 శాతం జీతాన్ని తీసుకునే వాటిలో ఏదొక పథకాన్ని ఎంచుకునేందుకు గడువును పెంచింది. ఇదివరకు విధించిన గడువును పొడిగించి 2021, మార్చి 31 వరకు ఇందులో ఏదొక విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చని వెల్లడించింది. వేతనం లేని సెలవు పథకాన్ని ఎయిర్ ఇండియా సంస్థ ఈ ఏడాది జులై రెండో వారం ప్రారంభించింది. అనంతర పరిణామాల్లో దీన్ని సెప్టెంబర్ 30 […]

Update: 2020-10-12 04:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ ఇండియా తమశాశ్వత ఉద్యోగులు వేతనం లేని సెలవును లేదా తక్కువ పనిదినాలు చేసి 60 శాతం జీతాన్ని తీసుకునే వాటిలో ఏదొక పథకాన్ని ఎంచుకునేందుకు గడువును పెంచింది. ఇదివరకు విధించిన గడువును పొడిగించి 2021, మార్చి 31 వరకు ఇందులో ఏదొక విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చని వెల్లడించింది. వేతనం లేని సెలవు పథకాన్ని ఎయిర్ ఇండియా సంస్థ ఈ ఏడాది జులై రెండో వారం ప్రారంభించింది. అనంతర పరిణామాల్లో దీన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

తాజాగా, దీన్ని మరింత కాలం పొడిగిస్తూ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అవకాశమివ్వనున్నట్టు ఎయిర్ ఇండియా జనరల్ మేనేజర్ మీనాక్షి కశ్యప్ ప్రకటించారు. ఎయిర్ ఇండియాలో మొత్తం 13 వేల మంది శాశ్వత ఉద్యోగులున్నారు. వీరందరికీ నెలవరీగా ఇచ్చే వేతనాల మొత్తం రూ. 230 కోట్లు ఉంటోంది. వేతనం లేని సెలవు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఉద్యోగుల నుంచి తగిన స్పందన కరువైంది.

ఇప్పటివరకు కేవలం 60 మంది ఉద్యోగులు మాత్రమే ఈ పథకాన్ని ఎంచుకున్నారు. వీరి వల్ల ఎయిర్ ఇండియా సంస్థకు వార్షిక వేతన బిల్లులో కేవలం రూ. 7 కోట్లు మాత్రమే కలిసి వస్తోందని కంపెనీ వెల్లడించింది. కాగా, ఎయిర్ ఇండియా సంస్థ గత కొన్నాళ్లుగా దారుణమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల ముందు ఈ పథకాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం సంస్థ సుమారు రూ. 70 వేల కోట్ల రుణాలను కలిగి ఉంది. ఈ ఏడాది జనవరిలో ప్రైవేటీకరణను ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, అనంతర కరోనా వ్యాప్తి పరిణామాలతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతూ వస్తోంది.

Tags:    

Similar News