వెన్నుపోటు పొడిచి కబ్జా చేశారు

దిశ, న్యూస్‌బ్యూరో: మణుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసి టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడాన్నిఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆగడాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. దీనిపై మణుగూరు వెళ్లేందుకు బయలుదేరిన సీఎల్పీ నేత భట్టిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. పినపాక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందని, టికెట్ ఇచ్చి గెలిపిస్తే పార్టీని, ఓట్లేసిన ప్రజలను మోసం చేసి […]

Update: 2020-07-29 09:46 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: మణుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసి టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడాన్నిఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆగడాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. దీనిపై మణుగూరు వెళ్లేందుకు బయలుదేరిన సీఎల్పీ నేత భట్టిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు.

పినపాక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందని, టికెట్ ఇచ్చి గెలిపిస్తే పార్టీని, ఓట్లేసిన ప్రజలను మోసం చేసి టీఆర్ఎస్‌లో చేరారని ఆయన విమర్శించారు. రాజకీయ జన్మనిచ్చిన పార్టీకే వెన్నుపోటు పొడిచి ఏకంగా కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కబ్జా పెట్టారని, ఇలాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వంశీచంద్ రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News