‘మిడతల దండు దాడులు చేస్తాయ్.. జాగ్రత్త’

దిశ, నిజామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్ నుంచి మిడతల దండు మహారాష్ట్ర వరకు వచ్చిందని.. ఏక్షణమైనా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ అధికారులు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా రైతులకు పలు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలోని వార్ధాలో ప్రస్తుతం మిడతల దండు కేంద్రీకృతమైందని, ఇవి గంటకు 5 నుంచి […]

Update: 2020-05-26 11:40 GMT

దిశ, నిజామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్ నుంచి మిడతల దండు మహారాష్ట్ర వరకు వచ్చిందని.. ఏక్షణమైనా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ అధికారులు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా రైతులకు పలు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలోని వార్ధాలో ప్రస్తుతం మిడతల దండు కేంద్రీకృతమైందని, ఇవి గంటకు 5 నుంచి 130 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ విజృంభిస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో కనిపించే మిడతలను ఎడారి మిడతలంటారని, పంటలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరుస్తాయని అధికారులు తెలిపారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News