స్కూళ్లు తెరిస్తే కొత్త కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది

దిశ,వెబ్‌డెస్క్ : మిగిలిన వయస్సు వారితో పోలిస్తే 12 నుంచి 16ఏళ్ల వయస్సున్న టీనేజర్లకు 7 రెట్లు ఎక్కువగా కొత్త కరోనా వైరస్ సోకుతున్నట్లు యూకేకి చెందిన సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎమర్జెన్సీ(సాగే) సైంటిస్ట్ మార్క్ వాల్ పోర్ట్ తెలిపారు. కొత్త కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, స్కూల్స్ మూసేసి కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే దాని వ్యాప్తిని అడ్డుకోలేమని  బీబీసీ ‘ఆండ్రూ మార్ షో’ పోగ్రాంలో తెలిపారు. స్కూళ్లకు వెళితే కరోనా […]

Update: 2021-01-04 00:55 GMT

దిశ,వెబ్‌డెస్క్ : మిగిలిన వయస్సు వారితో పోలిస్తే 12 నుంచి 16ఏళ్ల వయస్సున్న టీనేజర్లకు 7 రెట్లు ఎక్కువగా కొత్త కరోనా వైరస్ సోకుతున్నట్లు యూకేకి చెందిన సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎమర్జెన్సీ(సాగే) సైంటిస్ట్ మార్క్ వాల్ పోర్ట్ తెలిపారు. కొత్త కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, స్కూల్స్ మూసేసి కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే దాని వ్యాప్తిని అడ్డుకోలేమని బీబీసీ ‘ఆండ్రూ మార్ షో’ పోగ్రాంలో తెలిపారు.

స్కూళ్లకు వెళితే కరోనా సోకుతుందని మనకి తెలుసు. ఇంట్లో ఉన్న ఇతర వయస్సు కుటుంబ సభ్యుల కంటే 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సున్న వారికే కరోనా సోకుతుందన్నారు. ప్రస్తుతం పిల్లల్లో వ్యాప్తి తక్కువగా ఉందని, ఒక్కసారి పిల్లలు స్కూళ్లకు వెళితే ఇతర వైరస్‌ల కంటే 70% ఎక్కువగా ఈ కరోనా కొత్తవైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు.

ఈ కొత్త కరోనా వైరస్ వ్యాప్తిని వ్యాక్సిన్ అడ్డుకోగలదు. కఠినమైన జాగ్రత్తలు పాటించకపోతే దానిని అడ్డుకోలేం. ‘చిన్నపిల్లలపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్లు తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్న నేపథ్యంలో సైంటిఫిక్ చీఫ్ అడ్వైజర్ మార్క్ వాల్ పోర్ట్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రాథమిక సాక్ష్యాలు సైతం టీనేజ్ వయస్సున్న పిల్లలకు కరోనా సోకుందనే ఆధారాలున్నాయని గుర్తు చేశారు.లండన్ లోని ఇంపీరియల్‌ కాలేజ్ సైంటిస్ట్‌లు నిర్వహించిన పరిశోధనల్లో సైతం కొత్త కరోనా వైరస్ 50-70% ఎక్కువగా చిన్న పిల్లలకు సోకే ప్రమాదం ఉన్నట్లు తేలిందన్నారు. కరోనా వార్డ్‌లలో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు. వారిని చూస్తుంటే వైరస్ గతంలోకంటే ఎక్కువగా భయపెట్టేలా ఉందని ఇంపీరియల్ కాలేజ్ నర్స్ లారా డఫెల్ హెచ్చరించారు.

Tags:    

Similar News