డబ్ల్యూటీసీ ఫైనల్ వేదికగా ఏజెస్ బౌల్

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ నిర్వహిస్తున్న అరంగేట్ర వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. జూన్ 18 నుంచి 22 మధ్య ఈ ఫైనల్ లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతుందని గతంలోనే ఐసీసీ నిర్ణయించింది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో వేదికను మారుస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. లార్డ్ బదులుగా సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నట్లు తెలిపింది. లార్డ్స్‌లో బయోబబుల్ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కష్టమని ఇంగ్లాండ్ […]

Update: 2021-03-08 11:14 GMT
WTC
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ నిర్వహిస్తున్న అరంగేట్ర వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. జూన్ 18 నుంచి 22 మధ్య ఈ ఫైనల్ లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతుందని గతంలోనే ఐసీసీ నిర్ణయించింది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో వేదికను మారుస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. లార్డ్ బదులుగా సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నట్లు తెలిపింది.

లార్డ్స్‌లో బయోబబుల్ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కష్టమని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఐసీసీకి వివరించింది. గత ఏడాది పాకిస్తాన్, వెస్టిండీస్ సిరీస్‌లను ఏజెస్ బౌల్‌లో నిర్వహించినట్లు కూడా తెలిపింది. సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్‌ను ఆనుకొని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌తో పాటు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి మైదానం కూడా అందుబాటులో ఉన్నదని చెప్పింది. సౌతాంప్టన్‌లో బయోబబుల్ ఇప్పటికీ కొనసాగుతున్నదని.. కాబట్టి అక్కడే ఫైనల్ నిర్వహించాలని ఈసీబీ తమ నివేదికను ఐసీసీకి తెలిపింది. దీంతో ఐసీసీ సౌతాంప్టన్‌ను వేదికగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఈ విషయాన్ని అనధికారికంగా బీసీసీఐకి కూడా తెలియజేసినట్లు సమాచారం. ఫైనల్ వేదిక మారిన విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల ఏఎన్ఐ మీడియాకు వెల్లడించారు.

Tags:    

Similar News