బాబా కా దాబా స్ఫూర్తిగా..

దిశ, వెబ్‌డెస్క్: మొన్నటికి మొన్న దక్షిణ ఢిల్లీలోని మాళవీయనగర్‌లో దాబా నిర్వహిస్తున్న ఓ ఎనభై ఏళ్ల వ‌ృద్ధుడి బిజినెస్‌లో సోషల్ మీడియా ఎంత మార్పు తీసుకొచ్చిందో అందరూ చూశారు. కానీ సోషల్ మీడియా సహాయం ఆ ఒక్క దాబాతోనే ఆగిపోలేదు. దేశవ్యాప్తంగా ఎంతో మంది వృద్ధులు ఇలాంటి చిన్న చిన్న దాబాలు, ఫుడ్ స్టాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్నారు. మరి ఎవరో ఒక్కరికే మొత్తం సాయం చేయడానికి బదులు, శేషజీవితం హ్యాపీగా గడపాల్సిన సమయంలో ఇలా కష్టాలు పడుతున్నవారికి […]

Update: 2020-10-12 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: మొన్నటికి మొన్న దక్షిణ ఢిల్లీలోని మాళవీయనగర్‌లో దాబా నిర్వహిస్తున్న ఓ ఎనభై ఏళ్ల వ‌ృద్ధుడి బిజినెస్‌లో సోషల్ మీడియా ఎంత మార్పు తీసుకొచ్చిందో అందరూ చూశారు. కానీ సోషల్ మీడియా సహాయం ఆ ఒక్క దాబాతోనే ఆగిపోలేదు. దేశవ్యాప్తంగా ఎంతో మంది వృద్ధులు ఇలాంటి చిన్న చిన్న దాబాలు, ఫుడ్ స్టాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్నారు. మరి ఎవరో ఒక్కరికే మొత్తం సాయం చేయడానికి బదులు, శేషజీవితం హ్యాపీగా గడపాల్సిన సమయంలో ఇలా కష్టాలు పడుతున్నవారికి సాయం చేయాలని సోషల్ మీడియా నిర్ణయించుకుంది. అందుకే తమ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి కష్టపడే వృద్ధుల వ్యథలను కూడా వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెడుతున్నారు. అలా పెట్టిన వీడియోలకు కూడా ఎంతో కొంత సాయం దొరుకుతుండటం విశేషం.

కేరళలోని కరింబాలో ఫుడ్‌కోర్ట్ నడిపే పార్వతియమ్మ గురించి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కేరళీయలు ఆమె వద్దకు వెళ్లి భోజనం చేస్తున్నారు. ఈమె వీడియోను నటి రిచా చద్దా కూడా షేర్ చేసింది. అలాగే ఆగ్రాకు చెందిన కాంజీ బడే వాలా అంకుల్ కూడా చిన్న చాట్ స్టాల్‌ను నడుపుతున్నాడు. ఆయనకు కూడా సాయం చేయాలంటూ ఫుడ్ బ్లాగర్ దనిష్ట పెట్టిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన సెలెబ్రిటీలు పరిణీతి చోప్రా, స్వర భాస్కర్ నగదు రూపేణా సాయం చేస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి ఇలా కష్టపడుతున్న వృద్ధుల గాథలను సోషల్ మీడియాలో షేర్ చేసి, వారికి తోచినంత సాయం చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. వీళ్లందరూ ‘బాబా కా దాబా’ హ్యాష్‌ట్యాగ్ ఉపయోగిస్తుండటం గమనార్హం. మానవత్వం ఉన్న వారు సాటి మనిషిని కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఈ సంఘటనలు చూస్తుంటే అర్థమవుతోంది. సోషల్ మీడియా ద్వారా ఇలా మంచి జరగడం నిజంగా హర్షనీయం.

Tags:    

Similar News