యోగా ఫర్ బెటర్ హెల్త్
స్మార్ట్ ప్రపంచం.., 24/7 పోటాపోటీగా పరుగుతీసే లైఫ్. నిత్యం పని ఒత్తిడి. దృష్టింతా మంచి ఆర్థిక స్థితి పైనే. ఈ క్రమంలో మనిషి బిజీబిజీగా గడుపుతూ అనారోగ్యాన్ని వెంటే పెట్టుకున్నాడు. కాసింత సమయాన్ని వ్యాయామానికి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో రోజు కాసేపు యోగా సాధన చేస్తే మానసిక ప్రశాంతత తోడై ఉంటుంది. పని ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా భవిష్యత్‌లో అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు. ధ్యానం, యోగా, శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేస్తే నిత్యం ఫ్రెష్ మైండ్ […]
స్మార్ట్ ప్రపంచం.., 24/7 పోటాపోటీగా పరుగుతీసే లైఫ్. నిత్యం పని ఒత్తిడి. దృష్టింతా మంచి ఆర్థిక స్థితి పైనే. ఈ క్రమంలో మనిషి బిజీబిజీగా గడుపుతూ అనారోగ్యాన్ని వెంటే పెట్టుకున్నాడు. కాసింత సమయాన్ని వ్యాయామానికి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో రోజు కాసేపు యోగా సాధన చేస్తే మానసిక ప్రశాంతత తోడై ఉంటుంది. పని ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా భవిష్యత్‌లో అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు. ధ్యానం, యోగా, శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేస్తే నిత్యం ఫ్రెష్ మైండ్ తో ఉంటూ లక్ష్యాన్ని సులువుగా సాధించొచ్చు. అంతేకాదు మనిషి జీవనశైలిలో ఎంతో మార్పు తీసుకువస్తుంది.
దిశ, గచ్చిబౌలి: మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తున్న ఏకైక సాధనం యోగా. నగర ప్రజలు తమ బిజీ లైఫ్ లో యోగాసనాలతో ప్రశాంతత, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఈక్రమంలో యోగాకు రోజురోజుకూ ప్రాధాన్యత పెరిగిపోతోంది. కేవలం భారత్ కే పరిమితమైన యోగా నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ దేశ ప్రతిష్టను నలుమూలల పరిమళింపజేస్తున్నది. గతంలో వ్యాయామం, వాకింగ్ పై ఆసక్తి చూపేవారు. కానీ నేడు అతిపురాతనమైన యోగాను నేర్చుకునేందుకు ఇంటిల్లిపాది సిద్ధమవుతున్నారు. ఉదయం, సాయంత్రం పార్కుల్లో ఎక్కడ చూసినా ఆసనాలు వేస్తూ దర్శనమిస్తున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని అరవై పదులు దాటిన వారు సైతం యోగాలో శిక్షణ తీసుకుంటూ ఆరోగ్య జీవనం కోసం శ్రమిస్తున్నారు.
ఆరోగ్యానికి మేలు..
నేటి సమాజంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిడులు, ముసురుతున్న వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన వ్యాయామం చేయాల్సిందే. అందుకే వీటి ప్రాధాన్యతను గుర్తించి యోగార్షి పతంజలి, యోగ సూత్రాలు ప్రపంచానికి పూర్వకాలంలోనే పరిచయం చేశాడని చరిత్ర చెబుతోంది. యోగా వ్యాయామం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక జీవన శైలిలో భాగం. దీర్ఘకాలిక వ్యాధులు రోగనిర్ధారణలో వీటి ప్రాధాన్యతను గుర్తించే భారత ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది. అలాంటి యోగా వల్ల కలిగే ఉపశమనాలు, యోగా చేసే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.
కొన్ని వేల ఆసనాలు
ఆసనాలు అంటే చాలా మందిలో భయం నెలకొని ఉంటుంది. ఆసనాలలో మెలికలు తిప్పడం, శరీరాన్ని వంచడం, శ్వాసపై ధ్యాస అంటూ ఎన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎక్కడ వీలవుతుందంటూ చాలామంది నిరుత్సాహ పడుతున్నారు. ఆసనాలలో కొన్ని వేల రకాలు ఉన్నాయి. ప్రతిదీ శరీరంపై రక రకాల ప్రయోజనాలు, ప్రభావాలను చూపించేదే. ఆసనాల వల్ల పాదాల నుంచి తల వరకు చక్కటి కదలికలతో కండరాలు,నరాలు,ఎముకలు, రక్తనాళాలు వాటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే విధంగా చేసుకోవచ్చు.రోజు తమ ఆరోగ్యం కోసం 30 నిమిషాలు కేటాయించడంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యమే లక్ష్యంగా
వారసత్వ సంపద యోగా. ప్రజారోగ్యమే లక్ష్యంగా అనేక మంది ఉచితంగా యోగా శిక్షణ అందిస్తూ ప్రజలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. యోగాసనాలు వేల సంఖ్యలో ఉన్నాయని మనిషి మానసిక పరిస్థితి, శరీరానికి వచ్చిన జబ్బుల నుంచి విముక్తి కలిగించే ఆసనాలను మాత్రమే వేయిస్తున్నారు.
యోగాతో మానసిక ప్రశాంతత
యోగాసనాలతో ప్రశాంతత లభిస్తుంది. ఆసనాల ద్వారా ఆత్మ,పరమాత్మ సుగుణాలు సిద్ధిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా యోగాకు మంచి గుర్తింపు ఉంది. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రాణాయామం,హాగన, ప్రత్యాయార, నియమాలతో పాటు మరో 4 పద్ధతులు మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తాయి.
– వినయ్ కుమార్ పుట్ట, యోగ శిక్షకుడు
సమస్యల నుంచి ఉపశమనం
నేటి సమాజంలో పెరిగిపోతున్న వ్యాధులు, కాలుష్య కారకాల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతీ మనిషి ఏదో ఒక రకమైన వ్యాయామం చేయాల్సిందే. అందుకే వీటి ప్రాధాన్యత గుర్తించి వాటిని దైనందిక జీవితంలో భాగం చేసుకుంటున్నారు. యోగా వ్యాయామం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక జీవనశైలిలో భాగం. యోగా విధానాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. -జగన్ గురూజీ, యోగా గురువు