జాగ్రత్తగా చూస్తూనే దూరంగా ఉండాలి : అడివి శేషు

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు కరోనా వైరస్ గురించి కొన్ని సూచనలు అందించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వారిని పరిశుభ్ర వాతావరణంలో ఉంచడంతో పాటు… 24 గంటలు వారి ఆరోగ్యాన్ని కనిపెడుతూ ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని… వారిని మానిటర్ చేస్తూ ఉండాలన్నారు. ఇతర దేశాల్లో ఎక్కువ శాతం కరోనా బారిన పడింది ముసలి వారే […]

Update: 2020-03-23 07:18 GMT

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు కరోనా వైరస్ గురించి కొన్ని సూచనలు అందించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వారిని పరిశుభ్ర వాతావరణంలో ఉంచడంతో పాటు… 24 గంటలు వారి ఆరోగ్యాన్ని కనిపెడుతూ ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని… వారిని మానిటర్ చేస్తూ ఉండాలన్నారు. ఇతర దేశాల్లో ఎక్కువ శాతం కరోనా బారిన పడింది ముసలి వారే అని.. అందుకే వారిని మీ ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటూనే… వారికి కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా ఈ సూచనలు పాటించాలని కోరారు. లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్ళకుండా… ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అప్పుడే ఆరోగ్యకరమైన భవిష్యత్ ఉంటుందన్నారు.


Tags: Adivi sesh, CoronaVirus , Covid 19

Tags:    

Similar News