‘కంగనా పద్మశ్రీ వెనక్కి ఇచ్చేయ్’
క్వీన్ కంగనా రనౌత్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న నెపోటిజం సుశాంత్ ప్రాణం తీసిందని..ముఖ్యంగా మహేష్ భట్, కరణ్ జోహార్ లాంటి వాళ్లు ఇందుకు కారణమని న్యూస్ చానల్ డిబేట్స్‌లో కూడా చెప్పింది. తను ఆరోపించిన ప్రతి విషయానికీ ఓ కథ చెప్పిన కంగనా..ఆరోపణలు తప్పు అని రుజువు అయితే, పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తాను అని సవాల్ విసిరింది. సుశాంత్ కుటుంబ సభ్యులు మాత్రం […]
క్వీన్ కంగనా రనౌత్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న నెపోటిజం సుశాంత్ ప్రాణం తీసిందని..ముఖ్యంగా మహేష్ భట్, కరణ్ జోహార్ లాంటి వాళ్లు ఇందుకు కారణమని న్యూస్ చానల్ డిబేట్స్‌లో కూడా చెప్పింది. తను ఆరోపించిన ప్రతి విషయానికీ ఓ కథ చెప్పిన కంగనా..ఆరోపణలు తప్పు అని రుజువు అయితే, పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తాను అని సవాల్ విసిరింది.
సుశాంత్ కుటుంబ సభ్యులు మాత్రం రియా చక్రవర్తిని నిందితురాలిని చేస్తూ కేసు నమోదు చేశారు. అంటే నేపోటిజం సుశాంత్ మరణానికి కారణం కాదన్న విషయం అర్థం అవుతుంది అన్నారు నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలి. కాబట్టి కంగనా చేసిన ఆరోపణలు అన్నీ కూడా తప్పే అని.. తన మాట ప్రకారం పద్మశ్రీ వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 306 కింద రియా మీద కేసు నమోదు అయిందని.. కానీ, కంగనా మాత్రం ఇండస్ట్రీ వారిని ఈ విషయంలో టార్గెట్ చేసి టైమ్ వేస్ట్ చేసిందని మండిపడ్డారు. కంగనా ఈ విషయంపై స్పందించాలన్నారు.
కాగా, కంగనా ఈ మధ్య కరణ్ జోహార్‌ను పద్మశ్రీ వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తనను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని బెదిరించాడని..సుశాంత్ ఎదుగుదలకు అడ్డుపడింది కూడా తనే అని ఆరోపించింది. భారత ప్రభుత్వం కరణ్ పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలని కోరింది.