మావోయిస్టులు తిష్ట వేయాలని చూస్తున్నారు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మావోయిస్టులు తిష్ట వేయాలని చూస్తున్నారని ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. ఇటీవల దొరికిన మావోయిస్టు భాస్కర్ డైరీలో సంచలన విషయాలు బయట పడ్డాయని, అందులో కొంతమంది ఆదివాసీల పేర్లున్నాయని పేర్కొన్నారు. మంగి అటవీప్రాంతంలోని గుండాల గుట్టపై డైరీ లభ్యమైనట్టు ఎస్పీ వెల్లడించారు. కొందరు ప్రజల ముందు ఆదివాసీ నాయకులుగా తిరుగుతూ రహస్యంగా మావోయిస్టులకు సహకరిస్తున్నారని అన్నారు. అయితే మావోయిస్టులకు ఎవరెవరూ సహకరిస్తున్నారో తమ వద్ద సమాచారం ఉందన్నారు. కొంతమంది ఆదివాసీ నాయకులు […]

Update: 2020-08-29 07:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మావోయిస్టులు తిష్ట వేయాలని చూస్తున్నారని ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. ఇటీవల దొరికిన మావోయిస్టు భాస్కర్ డైరీలో సంచలన విషయాలు బయట పడ్డాయని, అందులో కొంతమంది ఆదివాసీల పేర్లున్నాయని పేర్కొన్నారు. మంగి అటవీప్రాంతంలోని గుండాల గుట్టపై డైరీ లభ్యమైనట్టు ఎస్పీ వెల్లడించారు. కొందరు ప్రజల ముందు ఆదివాసీ నాయకులుగా తిరుగుతూ రహస్యంగా మావోయిస్టులకు సహకరిస్తున్నారని అన్నారు. అయితే మావోయిస్టులకు ఎవరెవరూ సహకరిస్తున్నారో తమ వద్ద సమాచారం ఉందన్నారు.

కొంతమంది ఆదివాసీ నాయకులు తమ స్వార్థం కోసం అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారని, మావోయిస్టు భాస్కర్‌తో సంబంధాలు పెట్టుకొని, అతడి ఆదేశాల మేరకు మావోయిస్టు కార్యకలాపాలు అమలు చేస్తున్నారంటూ ఎస్పీ తెలిపారు. తుడుందెబ్బకు చెందిన మహేశ్, డీటీఎఫ్‌‌కు చెందిన రమేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘానికి చెందిన వివేక్, దీపక్, మత్తాడి గ్రామానికి చెందిన సీడమ్ జంగదేవ్, సులుగుపల్లికి చెందిన సోయం చిన్నయ్య, రొంపల్లికి చెందిన చంద్రశేఖర్, చాల్ బడి గోవిందరావు, పార్వతిగూడకు చెందిన హన్మంతరావు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Tags:    

Similar News