లాక్‌డౌన్ ఉన్నా.. వారు నిర్భయంగా వెల్లవచ్చు : ఎస్పీ

దిశ, ఆదిలాబాద్: పటిష్ట బందోబస్తు మధ్య జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ 16వ రోజు గురువారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(Adilabad District SP Rajesh Chandra) అన్నారు. ఈ 16 రోజుల కాలంలో లాక్‌డౌన్ ఉల్లంఘించిన 45 వాహనాలను, 5 కార్లను సీజ్ చేసినట్టు వెల్లడించారు. గురువారం పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నవారు నిర్భయంగా […]

Update: 2021-05-27 07:19 GMT

దిశ, ఆదిలాబాద్: పటిష్ట బందోబస్తు మధ్య జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ 16వ రోజు గురువారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(Adilabad District SP Rajesh Chandra) అన్నారు. ఈ 16 రోజుల కాలంలో లాక్‌డౌన్ ఉల్లంఘించిన 45 వాహనాలను, 5 కార్లను సీజ్ చేసినట్టు వెల్లడించారు. గురువారం పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నవారు నిర్భయంగా వెళ్ళవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్‌లో టీకా కోసం వచ్చిన మెసేజ్‌ను పోలీసులకు చూపిస్తే సరిపోతుందని అన్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉంటూ పోలీసులకు సహకరిస్తున్నారన్నారు.

పట్టణంలో కొందరు నిర్లక్ష్యంగా మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిని గుర్తించి 193 మందికి జరిమానా విధిస్తూ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టణ శివారులో ఒకేచోట గుమిగౌడి భౌతికదూరం పాటించని వారిపై ప్రత్యేక నిఘా వర్గాల ద్వారా గుర్తించి 67 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఉదయం పది గంటల అనంతరం లాక్ డౌన్ సమయంలో నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు, కార్లపై తిరుగుతున్న వారు, చిన్న చిన్న గల్లి ప్రాంతాల్లో షాపులు తెరిచి ఉంచిన 612 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 12 పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో 16 పికెటింగ్లు ఏర్పాటుచేసి బందోబస్తును కొనసాగిస్తున్నా మన్నారు. పాసులు ఉన్నవారు పోలీసుల తనిఖీ సమయంలో చూపించాలని కోరారు. జిల్లా ఎస్పీ వెంట ఓఎస్డీ హర్షవర్ధన్ శ్రీవాత్సవ్, అదనపు ఎస్పీలు ఎస్. శ్రీనివాసరావు, బి.వినోద్ కుమార్, డీఎస్పీలు ఎన్ఎస్వీ వెంకటేశ్వరరావు, కె. ఉమామహేశ్వరరావు సీఐలు, ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News