600 ఏళ్ల తర్వాత.. కేసీఆర్ పుట్టిన రోజున యాగం

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన సుమారు 600 ఏళ్లుగా ఎక్కడ జ‌ర‌గ‌ని రీతిలో అధి శ్రవణ యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్) చైర్మన్​ అలీపురం వెంకటేశ్వరరెడ్డి, దువ్వూరి గ‌ణేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో బుధ‌వారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 600 సంవత్సరాలకు పూర్వం కేర‌ళ రాష్ట్రంలో కేవ‌లం నంబూద్రి బ్రాహ్మణులకే ప‌రిమిత‌మైన ఈ యాగాన్ని లోక […]

Update: 2021-02-15 12:48 GMT

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన సుమారు 600 ఏళ్లుగా ఎక్కడ జ‌ర‌గ‌ని రీతిలో అధి శ్రవణ యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్) చైర్మన్​ అలీపురం వెంకటేశ్వరరెడ్డి, దువ్వూరి గ‌ణేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో బుధ‌వారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 600 సంవత్సరాలకు పూర్వం కేర‌ళ రాష్ట్రంలో కేవ‌లం నంబూద్రి బ్రాహ్మణులకే ప‌రిమిత‌మైన ఈ యాగాన్ని లోక క‌ల్యాణం నిమిత్తం నిర్వహిస్తున్నారు. యాగంతో బాధ‌లు, అగ్ని సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు పోయి రాష్ర్టం సస్యశ్యామలమవుతుందని నమ్మకం. యాగంలో పాల్గొనే వారు హిందూ సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలల్సి ఉంటుంది. ముందుగా గోత్ర నామాలను నమోదు చేయించుకోవాలి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా యాగం సాగుతుంది.

యాగం సాగేదిలా

ఉద‌యం 6 గంట‌ల నుంచి 7 గంట‌ల వ‌ర‌కు గోపూజ‌, మ‌హా గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌నం, 8 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ఆదిత్యాది నవగ్రహ చ‌తుష‌ష్ఠి, అధి శ్రావణ మ‌హారుద్ర యాగం, దుర్గా హ‌వ‌నం, శ్రీ హ‌వ‌నం, బ‌లి, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు మ‌హా పూర్ణాహుతి, తీర్థ ప్రసాదవితరణతో యాగం ముగుస్తుంద‌ని నిర్వాహ‌కులు వెల్లడించారు.

Tags:    

Similar News