రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు అష్టదిగ్బంధనం
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మార్లి గ్రామ శివారులో రాష్ట్ర సరిహద్దు ప్రదేశాన్ని అష్టదిగ్బంధనం చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని స్వయంగా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు, కార్మికులు వారి స్వగ్రామాలకు వెళ్లడానికి తీసుకువచ్చిన ధ్రువ పత్రాలు క్షుణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని సూచించారు. అలాగే […]
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మార్లి గ్రామ శివారులో రాష్ట్ర సరిహద్దు ప్రదేశాన్ని అష్టదిగ్బంధనం చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని స్వయంగా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు, కార్మికులు వారి స్వగ్రామాలకు వెళ్లడానికి తీసుకువచ్చిన ధ్రువ పత్రాలు క్షుణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో ఆహార సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే జిల్లాలోకి ప్రవేశించే వారికి తప్పకుండా స్క్రీనింగ్ చేయాలని జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి స్పష్టం చేశారు.
tag: Additional Collector veera reddy, Observation, border checkpost, sangareddy