బొగ్గు వేలంలో అదానీ అనాసక్తి!

న్యూఢిల్లీ: భారత్ తొలిసారిగా ప్రైవేటురంగానికి అవకాశమిస్తూ నిర్వహించబోతున్న బొగ్గు వేలంలో పాల్గొనడానికి దేశ అతిపెద్ద కోల్ ట్రేడర్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆసక్తిని కనబరచడం లేదు. ఈ వేలంలో పాల్గొనాలని భావించడం లేదని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్ అన్నారు. అదానీ గ్రూప్ కమర్షియల్ కోల్ మైనింగ్‌పై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలిపారు. అనంతరం అదానీ గ్రూప్ ఈ వ్యాఖ్యను సవరిస్తూ ఓ ప్రకటనవిడుదల చేసింది. కోల్ డిమాండ్, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను […]

Update: 2020-08-07 09:32 GMT

న్యూఢిల్లీ: భారత్ తొలిసారిగా ప్రైవేటురంగానికి అవకాశమిస్తూ నిర్వహించబోతున్న బొగ్గు వేలంలో పాల్గొనడానికి దేశ అతిపెద్ద కోల్ ట్రేడర్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆసక్తిని కనబరచడం లేదు. ఈ వేలంలో పాల్గొనాలని భావించడం లేదని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్ అన్నారు. అదానీ గ్రూప్ కమర్షియల్ కోల్ మైనింగ్‌పై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలిపారు.

అనంతరం అదానీ గ్రూప్ ఈ వ్యాఖ్యను సవరిస్తూ ఓ ప్రకటనవిడుదల చేసింది. కోల్ డిమాండ్, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను బట్టి వేలంలో పాల్గొంటామని ప్రకటించింది. అదానీ గ్రూప్ తడబాటు కోల్ సెక్టార్‌లోని పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. గ్లోబల్ కోల్ సెక్టార్ చౌక ధరలు, డిమాండ్ క్షీణత సవాళ్లను ఎదుర్కొంటోంది. నికరంగా బొగ్గు ఎగుమతిదారుగా మారాలని లక్షించిన భారత్‌కు ఈ పరిస్థితులు ప్రతిబంధకంగానే కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News