కొత్త వ్యాపారంలోకి అదానీ గ్రూప్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ ఇప్పటికే ఓడరేవులు మొదలుకొని విమానాశ్రయాల దాకా, మైనింగ్ నుంచి గ్యాస్ పంపిణీ వరకు అనేక రంగాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా అదానీ గ్రూప్ కొత్తగా అల్యూమినా రిఫైనరీ, అల్యూమినియం స్మెల్టర్‌ను ఏర్పాటు చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ అనుబంధంగా ముంద్రా అల్యూమినియం లిమిటెడ్‌ను రూ. లక్ష మూలధనంతో పెయిడ్ అప్ కేపిటల్‌ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అల్యూమినియంకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగంలోకి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ ఇప్పటికే ఓడరేవులు మొదలుకొని విమానాశ్రయాల దాకా, మైనింగ్ నుంచి గ్యాస్ పంపిణీ వరకు అనేక రంగాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా అదానీ గ్రూప్ కొత్తగా అల్యూమినా రిఫైనరీ, అల్యూమినియం స్మెల్టర్‌ను ఏర్పాటు చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ అనుబంధంగా ముంద్రా అల్యూమినియం లిమిటెడ్‌ను రూ. లక్ష మూలధనంతో పెయిడ్ అప్ కేపిటల్‌ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అల్యూమినియంకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగంలోకి ప్రవేశించామని, పెట్టుబడులు ఎక్కడ పెట్టాలనేదానిపై నిర్ణయించలేదని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి త్వరలో వివరాలను వెల్లడించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ గత కొంతకాలంగా కొత్త రంగాల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో అదానీ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ప్రారంభించింది. అనంతరం ఆగష్టులో రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కాంప్లెక్సులు, స్పెషాలిటీ కెమికల్ కేంద్రాలు, హైడ్రోజన్, దాని సంబంధిత కెమికల్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది.