మనుషుల కన్నా జంతువులే నయం : అదా శర్మ

దిశ, సినిమా : టాలెంటెడ్ అదా శర్మ, ఏ పని చేసినా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటుంది. మూవీ సెలెక్షన్ నుంచి పర్సనల్ లైఫ్ వరకు ప్రతీ పనిని భిన్నంగా ప్రయత్నించే అదా.. లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ ‘చూహా బిల్లి’లో తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలో ఐదు తెలుగు సినిమాలకు సైన్ చేసిన భామ.. ఓ చిత్రం షూటింగ్‌ స్పాట్‌లో గాయపడిన పక్షిని రక్షించి అభిమానుల కోరిక మేరకు ‘ట్విట్టర్’ అని పేరు కూడా […]

Update: 2021-03-02 04:28 GMT

దిశ, సినిమా : టాలెంటెడ్ అదా శర్మ, ఏ పని చేసినా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటుంది. మూవీ సెలెక్షన్ నుంచి పర్సనల్ లైఫ్ వరకు ప్రతీ పనిని భిన్నంగా ప్రయత్నించే అదా.. లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ ‘చూహా బిల్లి’లో తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలో ఐదు తెలుగు సినిమాలకు సైన్ చేసిన భామ.. ఓ చిత్రం షూటింగ్‌ స్పాట్‌లో గాయపడిన పక్షిని రక్షించి అభిమానుల కోరిక మేరకు ‘ట్విట్టర్’ అని పేరు కూడా పెట్టింది. కాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రస్తావించిన అదా.. మనుషుల కన్నా జంతువులతోనే ఎక్కువ కంఫర్ట్‌గా ఫీల్ అవుతానని తెలిపింది. పార్టీలు, ఫంక్షన్స్‌లో అపరిచితులతో స్పెండ్ చేయడం చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందని, కానీ అడవుల్లో జంతువుల మధ్య వదిలేస్తే మాత్రం ఇల్లులా ఫీల్ అవుతానంది.

Tags:    

Similar News