భారత్‌లో పెరుగుతున్న ప్రకటనల వ్యయం
దిశ, వెబ్‌డెస్క్: 2020లో కరోనా మహమ్మారి వల్ల 21.5 శాతం క్షీణించిన తర్వాత దేశీయంగా మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనల వ్యయం 2021లో 23.5 శాతం పెరుగుతుందని గ్రూప్ ఎమ్ సంస్థ అభిప్రాయపడింది. ఈ పెరుగుదలతో ప్రకటనల వ్యయం విలువ రూ. 80,123 కోట్లకు చేరుకుంటుందని, అయితే..2019లో నమోదైన రూ. 83 వేల కోట్లతో పోలిస్తే ఇది ఇంకా తక్కువేనని గ్రూప్ ఎమ్ దక్షిణాసియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ కుమార్ చెప్పారు. గతేడాది కరోనాకు ముందు ఈ సంస్థ […]
దిశ, వెబ్‌డెస్క్: 2020లో కరోనా మహమ్మారి వల్ల 21.5 శాతం క్షీణించిన తర్వాత దేశీయంగా మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనల వ్యయం 2021లో 23.5 శాతం పెరుగుతుందని గ్రూప్ ఎమ్ సంస్థ అభిప్రాయపడింది. ఈ పెరుగుదలతో ప్రకటనల వ్యయం విలువ రూ. 80,123 కోట్లకు చేరుకుంటుందని, అయితే..2019లో నమోదైన రూ. 83 వేల కోట్లతో పోలిస్తే ఇది ఇంకా తక్కువేనని గ్రూప్ ఎమ్ దక్షిణాసియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ కుమార్ చెప్పారు. గతేడాది కరోనాకు ముందు ఈ సంస్థ ప్రకటించిన దాని ప్రకారం 2020లో ప్రకటనల ఖర్చు 10.7 శాతం వృద్ధితో సుమారు రూ. 92 వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది.
కానీ, కరోనా వల్ల అది సాధ్యపడలేదు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ప్రకటనల వ్యయంలో భారత్ 10వ స్థానానికి పడిపోయింది. 2021లో మెరుగైన వృద్ధితో 9వ స్థానానికి వచ్చేందుకు అవకాశముందని, అదేవిధంగా పెరుగుతున్న వ్యయం పరంగా చూస్తే భారత్ ఆరో స్థానంలో ఉందని గ్రూప్ ఎమ్ ఏజెన్సీ తెలిపింది. గతేడాది నుంచి అనూహ్యంగా డిజిటల్ విభాగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్‌లోనూ టెలివిజన్ ప్రకటనల వ్యయం పెరుగుతోంది, ఇక ఈ ఏడాది ప్రింట్ మీడా కూడా మొత్తం ప్రకటనల వ్యయంలో 16 శాతాన్ని ఉండొచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్రకటనల్లో భారత్ వాటా 40 శాతంగా ఉంది.