నడుము మత్తులో సౌత్ ఇండియన్స్: పూజ

దిశ, వెబ్ డెస్క్: బుట్ట బొమ్మ పూజా హెగ్డే వ్యవహారం సౌత్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది. దక్షిణాదిన స్టార్ డమ్ తెచ్చుకున్న భామ..సౌత్ ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడటంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న భామ..అటు బాలీవుడ్‌లోనూ సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ సరసన చాన్స్ కొట్టేసి ఫుల్ ఆన్ స్వింగ్‌లో ఉంది. కానీ, సౌత్ ఇండస్ట్రీ ఆదరణ వల్లే స్టార్ హీరోయిన్ […]

Update: 2020-11-06 04:34 GMT

దిశ, వెబ్ డెస్క్: బుట్ట బొమ్మ పూజా హెగ్డే వ్యవహారం సౌత్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది. దక్షిణాదిన స్టార్ డమ్ తెచ్చుకున్న భామ..సౌత్ ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడటంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న భామ..అటు బాలీవుడ్‌లోనూ సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ సరసన చాన్స్ కొట్టేసి ఫుల్ ఆన్ స్వింగ్‌లో ఉంది. కానీ, సౌత్ ఇండస్ట్రీ ఆదరణ వల్లే స్టార్ హీరోయిన్ అయ్యాననే విషయాన్ని మరిచి..సెటైర్ వేసింది. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తక్కువ చేసింది మాట్లాడింది. సౌత్ ఇండియన్ సినిమా నడుము మత్తులో ఉంటుందని కామెడీ చేసింది. తను చేసింది కామేడీ అయినా సరే..అలా చెప్పడం పద్ధతి కాదంటూ ఫైర్ అవుతున్నారు సౌత్ ఇండియన్స్. నడుము మత్తులో ఉన్నారని చెప్తున్న పూజా..నడుము ఎందుకు చూపించింది..తనకు ఇబ్బందిగా ఉండి ఉంటే మానుకోవాల్సింది కదా అంటున్నారు. అసలు యాక్టింగ్ రాక గ్లామరస్ డాల్‌లా మారిపోయిన పూజ నడము అందాలు అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు.

ఇటలీలో ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన పూజ..హైదరాబాద్‌లో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయింది.

Tags:    

Similar News