మంత్రిపై కామెంట్స్.. నటుడి అరెస్ట్
దిశ, సినిమా : మరాఠీ యాక్టర్ మయూరేష్ కోట్కర్‌కు బెయిల్ లభించింది. మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, అతని తల్లిదండ్రులపై అసభ్యకర కామెంట్స్ చేసినందుకు గాను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. నవీ ముంబై ఎయిర్‌పోర్టుకు శివసేన ఫౌండర్ బాలాసాహెబ్ ఠాక్రే పేరు పెట్టాలని ప్రతిపాదించిన మంత్రిని ఇష్టారీతిన తిట్టేస్తూ పోస్ట్ పెట్టిన మయూరేష్.. మాజీ పార్లమెంట్ సభ్యుడు, పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ సభ్యుడు దినకర్ బి పాటిల్ పేరు […]
దిశ, సినిమా : మరాఠీ యాక్టర్ మయూరేష్ కోట్కర్‌కు బెయిల్ లభించింది. మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, అతని తల్లిదండ్రులపై అసభ్యకర కామెంట్స్ చేసినందుకు గాను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. నవీ ముంబై ఎయిర్‌పోర్టుకు శివసేన ఫౌండర్ బాలాసాహెబ్ ఠాక్రే పేరు పెట్టాలని ప్రతిపాదించిన మంత్రిని ఇష్టారీతిన తిట్టేస్తూ పోస్ట్ పెట్టిన మయూరేష్.. మాజీ పార్లమెంట్ సభ్యుడు, పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ సభ్యుడు దినకర్ బి పాటిల్ పేరు పెట్టాలని కోరాడు. ఈ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసేలా ఉన్నాయన్న కారణంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 505 కింద కేసు నమోదు చేయగా, రెండు రోజుల తర్వాత బెయిల్ లభించింది.