రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చిన బాలీవుడ్ ఖాన్.. షాక్ లో ఫ్యాన్స్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన భార్య, ఫిల్మ్‌ మేకర్‌ కిరణ్‌ రావు తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు శనివారం అమీర్ తెలిపారు. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ,  పిల్లలకు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం.. అంతే కాకుండా సినిమాలలోనూ కలిసే పనిచేస్తాం.. ఇప్పటివరకు మాకు సపోర్ట్ గా నిలిచినా మా కుటుంబాలకు మేము ధన్యవాదాలు […]

Update: 2021-07-03 01:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన భార్య, ఫిల్మ్‌ మేకర్‌ కిరణ్‌ రావు తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు శనివారం అమీర్ తెలిపారు. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ, పిల్లలకు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం.. అంతే కాకుండా సినిమాలలోనూ కలిసే పనిచేస్తాం.. ఇప్పటివరకు మాకు సపోర్ట్ గా నిలిచినా మా కుటుంబాలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము.. మా నిర్ణయాన్ని గౌరవించినందుకు రుణపడి ఉంటామని” అమీర్ తెలిపారు. ఇకపోతే అమీర్ 2002 లో మొదటి భార్య రీనా దత్తా తో విడిపోయి, 2005 లో కిరణ్‌ రావు ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు.

 

Tags:    

Similar News