రైతు బంధు పైసలు జమచేస్తే చర్యలు తప్పవు….ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
దిశ, వికారాబాద్: బాకీల రుణాల కింద రైతు బంధు డబ్బులు జమచేసినచో,చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఎల్డిఎం రాంబాబు, డిసి భవనం, మద్గుల్ చిట్టెంపల్లిలో నిర్వహించిన బ్యాంకర్ల (డీసీసీ/డిఎల్ఆర్ సి)రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మన జిల్లాలో ఎక్కువగా ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారన్నారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. రైతులకోసం ప్రభుత్వం […]
దిశ, వికారాబాద్: బాకీల రుణాల కింద రైతు బంధు డబ్బులు జమచేసినచో,చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఎల్డిఎం రాంబాబు, డిసి భవనం, మద్గుల్ చిట్టెంపల్లిలో నిర్వహించిన బ్యాంకర్ల (డీసీసీ/డిఎల్ఆర్ సి)రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మన జిల్లాలో ఎక్కువగా ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారన్నారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. రైతులకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న రైతు బంధు పథకం డబ్బులను తప్పని సరిగా రైతులకు ఇవ్వాలన్నారు.