యువతిని అది ధరించకుండా పాఠశాలకు రావాలన్న యాజమాన్యం.. పట్టించుకోని అధికారులు

దిశ, సిద్దిపేట: అధిక ఫీజులు తీసుకోవడంతో పాటు విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో మైనార్టీ విద్యార్థిని స్కార్ఫ్ ముఖానికి ధరించుకుని స్కూల్‌కు వెళ్లింది. సదరు పాఠశాల నిర్వాహకులు స్కార్ఫ్ తీసేసి పాఠశాలకు రావాలని అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓవైపు కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుంది పాఠశాల నిర్వాహకులు మాత్రం […]

Update: 2021-12-21 05:11 GMT

దిశ, సిద్దిపేట: అధిక ఫీజులు తీసుకోవడంతో పాటు విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో మైనార్టీ విద్యార్థిని స్కార్ఫ్ ముఖానికి ధరించుకుని స్కూల్‌కు వెళ్లింది. సదరు పాఠశాల నిర్వాహకులు స్కార్ఫ్ తీసేసి పాఠశాలకు రావాలని అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓవైపు కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుంది పాఠశాల నిర్వాహకులు మాత్రం ముఖానికి ఏవి ధరించవద్దు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి పాఠశాలల పట్ల ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పటికైనా వెంటనే స్పందించి సిద్ధార్థ పాఠశాల పై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే విద్యార్థి సంఘాల నాయకులతో స్కూల్ ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు.

పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతున్న అధికారులు అసమర్థతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకునే విధంగా, వెంటనే ఒక కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి‌ని వివరణ కోరగా తాను అందుబాటులో లేనని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై లిఖితపూర్వకంగా జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యాక్రమంలో మైనార్టీ పట్టణ అధ్యక్షులు సయేద్ అతీక్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు రయేసుద్దీన్ గాయసుద్దీన్, నదీమ్, ప్యాయజ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News