కల్యాణలక్ష్మీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో కల్యాణ లక్ష్మీ పథకానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారిపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు చర్యలు తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిలో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. గండీడ్ మండలం అదనపు ఆర్ఐ రాఘవేందర్ రావు, ప్రస్తుతం నవాబ్ పేటలో ఆర్ఐగా పని చేస్తున్న గోవర్ధన్ సస్పెండ్ అయ్యారు. గతంలో ఇక్కడ […]

Update: 2020-06-17 21:53 GMT

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో కల్యాణ లక్ష్మీ పథకానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారిపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు చర్యలు తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిలో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. గండీడ్ మండలం అదనపు ఆర్ఐ రాఘవేందర్ రావు, ప్రస్తుతం నవాబ్ పేటలో ఆర్ఐగా పని చేస్తున్న గోవర్ధన్ సస్పెండ్ అయ్యారు. గతంలో ఇక్కడ వీఆర్వోగా పనిచేసిన మొయిన్ బాబు సస్పెన్షన్ కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సిఫారసు చేశారు. అలాగే తహశీల్దార్ ఎం.కె. ముంతాజిబుద్దిన్ సస్పెన్షన్ కు సీసీఎల్ఏకు సిఫారసు చేశారు. అదే సమయంలో ఈ పథకంలో అక్రమాలకు మూల కారకుడైన గండీడ్ కు చెందిన మధ్యవర్తి హనుమయ్యపై, శీలం భీమమ్మపై కూడా క్రిమినల్ చర్యలకు ఆదేశించారు.

Tags:    

Similar News