అచ్చెన్నా…పదవి వచ్చేనా..

దిశ వెబ్ డెస్క్: త్వరలో టీడీపీలో అచ్చెన్నాయుడికి ప్రమోషన్ లభించనుంది. ఈ మేరకు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయనకు టీడీపీ రాష్ర అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతోంది. కాగా ప్రజా సమస్యలపై జగన్ సర్కార్ ను ఆయన ఎప్పటికప్పుడు నిలదీస్తు వస్తున్నారు. అందుకే అచ్చెన్నాయుడిపై కక్ష సాధించేందుకే ఆయన్నిఅరెస్టు చేసి వైసీపీ ఇబ్బందులు పెడుతోందని టీడీపీ […]

Update: 2020-09-03 05:24 GMT
అచ్చెన్నా…పదవి వచ్చేనా..
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: త్వరలో టీడీపీలో అచ్చెన్నాయుడికి ప్రమోషన్ లభించనుంది. ఈ మేరకు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయనకు టీడీపీ రాష్ర అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతోంది. కాగా ప్రజా సమస్యలపై జగన్ సర్కార్ ను ఆయన ఎప్పటికప్పుడు నిలదీస్తు వస్తున్నారు. అందుకే అచ్చెన్నాయుడిపై కక్ష సాధించేందుకే ఆయన్నిఅరెస్టు చేసి వైసీపీ ఇబ్బందులు పెడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీపై దూకుడుగా వ్యవహరిస్తుండటం…ఇటు ఆ పదవిని అచ్చెన్నాయుడికి ఇస్తే బాగుంటుదని పార్టీలోనీ పలువురు సీనియర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే అచ్చెన్నాయుడి లాంటి వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడమే కరక్ట్ అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇటు సీనియర్ల మద్దతు ఉండటం..చంద్రబాబు కూడా ఓకే చెబుతుండటంతో త్వరలోనే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News