అచ్చెన్నాయుడు తొలిరోజు ఏసీబీ విచారణ పూర్తి

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, పరికరాల కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు తొలి రోజు గుంటూరులోని గవర్నమెంటు ఆసుపత్రిలో విచారించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడును మూడ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో మూడుగంటల పాటు విచారణ జరిగింది. ఇదే కేసులోని నలుగురు నిందితులను రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విజయవాడకు తరలించిన ఏసీబీ రహస్య ప్రదేశంలో విచారించినట్టు […]

Update: 2020-06-25 09:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, పరికరాల కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు తొలి రోజు గుంటూరులోని గవర్నమెంటు ఆసుపత్రిలో విచారించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడును మూడ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో మూడుగంటల పాటు విచారణ జరిగింది. ఇదే కేసులోని నలుగురు నిందితులను రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విజయవాడకు తరలించిన ఏసీబీ రహస్య ప్రదేశంలో విచారించినట్టు తెలుస్తోంది. విచారణలో ఈఎస్ఐ కుంభకోణంపై కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News