బీటెక్ విద్యార్థి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసును ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హోం మంత్రి సుచరిత, వాసిరెడ్డి పద్మ తో సహా చాలా మంది పెద్దలు సత్వరమే స్పందించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకువచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితున్ని గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని అందించడంతో పోలీసులు త్వరగా నిందితున్ని పట్టుకున్నారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. […]
దిశ, వెబ్ డెస్క్: బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసును ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హోం మంత్రి సుచరిత, వాసిరెడ్డి పద్మ తో సహా చాలా మంది పెద్దలు సత్వరమే స్పందించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకువచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితున్ని గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని అందించడంతో పోలీసులు త్వరగా నిందితున్ని పట్టుకున్నారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.
యువతులు, మహిళల పై దాడులకు ప్రయత్నిస్తే కఠిన శిక్షలు తప్పవు అని ఇప్పటికే ప్రభుత్వం చాలా సందర్బాలలో ప్రకటించింది. అయితే కొందరు రాజకీయ నాయకులు జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నారని, అది వారి నైతికతకే వదిలేస్తున్నామని అధికారులు అన్నారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. వేగంగా స్పందించి కేసు ను ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులను ప్రభుత్వం అభినందించింది. ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చామని, మహిళల రక్షణ మా ప్రథమ కర్తవ్యమని, ఇందుకోసమై అహర్నిశలు శ్రమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.