ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్‌లు ఇస్తున్న యాక్సెంచర్!
దిశ, సెంట్రల్ డెస్క్: ఐటీ సర్వీసుల దిగ్గజం యాక్సెంచర్ సంస్థ ఇటీవల తమ ఉద్యోగుల్లో ఎక్కువమందికి ప్రమోషన్లను ఇచ్చింది. అలాగే, బోనస్‌లను కూడా అందించింది. దేశంలోని మొత్తం 2 లక్షల మంది ఉద్యోగుల్లో సగానికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లను, బోనస్‌లను అందించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా యాక్సెంచర్ సంస్థ ఐటీ సర్వీసుల రంగంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తోంది. ప్రతి ఏడాది కనీసం 2,500 మంది కొత్తవాళ్లను తీసుకుంటోంది. దేశీయంగా సుమారు 45 లక్షల మంది […]
దిశ, సెంట్రల్ డెస్క్: ఐటీ సర్వీసుల దిగ్గజం యాక్సెంచర్ సంస్థ ఇటీవల తమ ఉద్యోగుల్లో ఎక్కువమందికి ప్రమోషన్లను ఇచ్చింది. అలాగే, బోనస్‌లను కూడా అందించింది. దేశంలోని మొత్తం 2 లక్షల మంది ఉద్యోగుల్లో సగానికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లను, బోనస్‌లను అందించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా యాక్సెంచర్ సంస్థ ఐటీ సర్వీసుల రంగంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తోంది. ప్రతి ఏడాది కనీసం 2,500 మంది కొత్తవాళ్లను తీసుకుంటోంది. దేశీయంగా సుమారు 45 లక్షల మంది ఉద్యోగులకు అవకాశాలను అందించే ఐటీ రంగంలో నెలకు 20 వేల కొత్త ఉద్యోగాలకు ఈ సంస్థ మార్గాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో 2.05 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్‌కామ్ పేర్కొంది.
ఇటీవల ఆఫర్ లెటర్లను ఇచ్చిన అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించామని యాక్సెంచర్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అలాగే, కంపెనీలో చేరిన దగ్గరినుంచి అన్ని రకాల వేతన సౌకర్యాలను అందించామని పేర్కొన్నారు. కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల వ్యాపారాలు జరగక కొన్ని సంస్థలు సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఐటీ రంగంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు సిబ్బంది కోతను, వేతనాల్లో కోతను విధించాయి. ప్రమోషన్లను కూడా వాయిదా వేశాయి. ఐటీ దిగ్గజం విప్రో సంస్థ ఆఫర్ లెటర్లు ఇచ్చిన అందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే, జీతాల పెంపు, ప్రమోషన్లను వాయిదా వేసినట్టు చెప్పారు. మరో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఈ మధ్య ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను తాత్కాలికంగా ఆపేసినట్టు పేర్కొంది. వ్యయాన్ని తగ్గించేందుకే ఈ చర్యలని పేర్కొంది. ఈ క్రమంలో యాక్సెంచర్ సంస్థ ప్రమోషన్లు, బోనస్‌లు అందించడం గమనార్హం.