జగన్ ప్రోద్బలంతోనే అచ్చెన్నాయుడుపై ఏసీబీ దాడులు: బాబు

దిశ, ఏపీ బ్యూరో: బలహీన వర్గాలను అణచి వేయడమే లక్ష్యంగా జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు నేపథ్యంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడుపై జగన్ ప్రోద్బలంతోనే ఏసీబీ దాడులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. గత 38 ఏళ్లుగా అచ్చెన్నాయుడు తనకు తెలుసున్న బాబు, వారిది మచ్చలేని కుటుంబమని […]

Update: 2020-06-12 03:41 GMT

దిశ, ఏపీ బ్యూరో: బలహీన వర్గాలను అణచి వేయడమే లక్ష్యంగా జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు నేపథ్యంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడుపై జగన్ ప్రోద్బలంతోనే ఏసీబీ దాడులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. గత 38 ఏళ్లుగా అచ్చెన్నాయుడు తనకు తెలుసున్న బాబు, వారిది మచ్చలేని కుటుంబమని అన్నారు. అచ్చెన్నాయుడికి ఏదైనా హాని జరిగితే, ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్యేనని, లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో వందలాది మంది పోలీసులను పంపించి, ఈ తరహాలో అరెస్ట్ కు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ జగన్‌లోని శాడిజానికి పరాకాష్ఠని చంద్రబాబు అభివర్ణించారు. ఓ ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News