ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఆయుష్ సూచనలు
దిశ,వెబ్ డెస్క్ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారి బారినపడకుండా మనల్ని మనం కాపాడుకొనేలా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొనేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ పలు కీలక సూచనలు చేసింది. 1. వంటకాల్లో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి 2. 150 మిల్లీ లీటర్ల పాలలో అర స్పూను పసుపు […]
దిశ,వెబ్ డెస్క్ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారి బారినపడకుండా మనల్ని మనం కాపాడుకొనేలా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొనేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ పలు కీలక సూచనలు చేసింది.
1. వంటకాల్లో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి
2. 150 మిల్లీ లీటర్ల పాలలో అర స్పూను పసుపు కలుపుకొని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగండి.
3. దాహం వేస్తే గోరువెచ్చని నీరు తాగండి.
4. తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైన వాటితో చేసిన డికాషన్ ను రోజుకు రెండుసార్లు తాగండి
5. ఉదయం, సాయంత్ర వేళలో నువ్వుల నూనె లేదా కొబ్బరినూనె లేదా నెయ్యిని ముక్కుల్లో వేసుకోవాలి.
6. రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయాలి. తరువాత నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
7. పొడి దగ్గు ఉంటే పుదీనా ఆకులను లేదా సోంపు గింజలను కలిపిన నీటితో ఆవిరి పట్టాలి.
8. సాధారణ దగ్గు, గొంతు నొప్పి ఉంటే.. లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి.
9. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి.
Tags : corona virus, imunity power, aayush , precautions