కరోనా వారియర్స్ కు ఆరాధ్య బచ్చన్ సలామ్.. డ్రాయింగ్ వైరల్..

ప్రపంచ సుందరి, నీలికళ్ల అందాల తార ఐశ్వర్యా రాయ్, హీరో అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్ కరోనా వారియర్స్ కు ధన్యవాదాలు తెలుపుతూ చేసిన డ్రాయింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కరోనా మహమ్మారి బారినపడకుండా ప్రజలను రక్షించేందుకు వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జవాన్లు, మీడియా … తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నారని… వారి సూచనల మేరకు నడుచుకోవాలని అర్ధం వచ్చేలా వేసిన ఆరాధ్య వేసిన ఆర్ట్ ఆకట్టుకుంటోంది. అంతే కాదు తనతో […]

Update: 2020-05-04 06:32 GMT
కరోనా వారియర్స్ కు ఆరాధ్య బచ్చన్ సలామ్.. డ్రాయింగ్ వైరల్..
  • whatsapp icon

ప్రపంచ సుందరి, నీలికళ్ల అందాల తార ఐశ్వర్యా రాయ్, హీరో అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్ కరోనా వారియర్స్ కు ధన్యవాదాలు తెలుపుతూ చేసిన డ్రాయింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కరోనా మహమ్మారి బారినపడకుండా ప్రజలను రక్షించేందుకు వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జవాన్లు, మీడియా … తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నారని… వారి సూచనల మేరకు నడుచుకోవాలని అర్ధం వచ్చేలా వేసిన ఆరాధ్య వేసిన ఆర్ట్ ఆకట్టుకుంటోంది. అంతే కాదు తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా ఆర్ట్ లో యాడ్ చేసిన ఆరాధ్య.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరింది. తరచూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా ఉంటారని.. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని తన ఆర్ట్ ద్వారా సూచించింది ఐశ్వర్య కూతురు.

కాగా ఆరాధ్య వేసిన డ్రాయింగ్ షేర్ చేస్తూ… నా డార్లింగ్ కరోనా వారియర్స్ కు ప్రేమ, కృతజ్ఞతలు తెలుపుతూ వేసిన ఆర్ట్ అంటూ షేర్ చేసింది తల్లి ఐశ్వర్య.

ఇక ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ డ్రాయింగ్ షేర్ చేశారు. ఎనిమిదేళ్ల చిన్నారి అయినా సరే.. పరిస్థితిని అర్థం చేసుకుంటే.. తన భావాన్ని వ్యక్తపరచగలదు అంటూ ట్వీట్ చేశాడు.

Tags: Amitabh Bachan, Aishwarya Rai Bachchan, Abhishek Bachchan, Aaradhya Bachchan, Corona, Covid19

Tags:    

Similar News