గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ పోటీ
న్యూఢిల్లీ : గుజరాత్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ప్రకటించింది. 504 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమికి బలమైన ప్రతిపక్ష ఎదగబోతున్నట్లు ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్రంలో పంచాయతీ, జిల్లా తాలూకాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆప్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ఎమ్మెల్యే, […]
న్యూఢిల్లీ : గుజరాత్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ప్రకటించింది. 504 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమికి బలమైన ప్రతిపక్ష ఎదగబోతున్నట్లు ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్రంలో పంచాయతీ, జిల్లా తాలూకాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆప్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అతిషి విడుదల చేశారు. మొదటిసారి గుజరాత్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో పోటీ ద్వారా అధికార బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతాం. బీజేపీని అధికారం నుంచి దించడమే లక్ష్యంగా ఆప్ పనిచేస్తుందని అతిషి పేర్కొన్నారు.