కన్హయ్య కుమార్ విచారణకు ఆప్ ఓకే

న్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు, వామపక్ష నాయకుడు కన్హయ్య కుమార్‌ను దేశద్రోహం కేసులో విచారించేందుకు ఆప్ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కన్హయ్య కుమార్‌తోపాటు మరో తొమ్మిది మంది ఈ విచారణను ఎదుర్కోనున్నారు. 2016 ఫిబ్రవరిలో వర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. కేసులో దాఖలు చేసిన ఫిర్యాదులు, ఆధారాలతో నిందితులు కన్హయ్య కుమార్, సయ్యద్ ఉమర్ ఖాలిద్, అనిర్బన్ […]

Update: 2020-02-29 04:52 GMT

న్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు, వామపక్ష నాయకుడు కన్హయ్య కుమార్‌ను దేశద్రోహం కేసులో విచారించేందుకు ఆప్ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కన్హయ్య కుమార్‌తోపాటు మరో తొమ్మిది మంది ఈ విచారణను ఎదుర్కోనున్నారు. 2016 ఫిబ్రవరిలో వర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. కేసులో దాఖలు చేసిన ఫిర్యాదులు, ఆధారాలతో నిందితులు కన్హయ్య కుమార్, సయ్యద్ ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్య, అక్విబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీస్ రసూల్, భషరత్ అలీ, ఖాలీద్ భషీర్‌లు 124ఏ, 120బీ ఐపీసీ 1860 కింద నేరం చేసినట్టుగా తోస్తున్నదని ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ ఫిబ్రవరి 27న విడుదల చేసిన ఆర్డర్ పేర్కొంది. ఈ అనుమతి న్యాయ ప్రక్రియలో ఒక భాగమని, ఈ కేసులోని నిజానిజాలను కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే నిర్ధారిస్తుందని తాము భావిస్తున్నట్టు ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వానికి థాంక్స్ : కన్హయ్య కుమార్

తనపై నమోదైన కేసు విచారణకు అనుమతినిచ్చినందుకు ఢిల్లీ ప్రభుత్వానికి కన్హయ్య కుమార్ థాంక్స్ చెప్పారు. కేసు విచారణ వేగవంతంగా జరపాలని పోలీసులు, ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగంగా విచారణ సాగేందుకు తోడ్పడి.. టీవీ చానెళ్లలో ‘విచారణ’కు అవకాశమివ్వొద్దని పేర్కొన్నారు. మన దేశంలో సెడిషన్ కేసులు రాజకీయ లబ్దికోసం, వాస్తవ సమస్యల నుంచి ప్రజలను దారిమళ్లించేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News