‘మనోజ్ తివారీకీ ఎగ్జిట్ పోల్సే’

          ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌ను తప్పుబట్టిన ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మనోజ్ తివారీకి, ఆప్ నాయకుడు సౌరవ్ భరద్వాజ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎగ్జిట్ పోల్స్‌కు రెండు రకాల అర్థాలున్నాయి. ఒకటి ఇక్కడ జరిగిన ఎన్నికలకు సంబంధించినది కాగా, రెండోది ఢిల్లీ బీజేపీ చీఫ్‌గా మనోజ్ తివారి ఎగ్జిట్ అవ్వడానికి సంబంధించినది’ అని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మనోజ్ తివారికి బీజేపీ చీఫ్ పదవి ఊడుతుందని […]

Update: 2020-02-09 03:16 GMT

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌ను తప్పుబట్టిన ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మనోజ్ తివారీకి, ఆప్ నాయకుడు సౌరవ్ భరద్వాజ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎగ్జిట్ పోల్స్‌కు రెండు రకాల అర్థాలున్నాయి. ఒకటి ఇక్కడ జరిగిన ఎన్నికలకు సంబంధించినది కాగా, రెండోది ఢిల్లీ బీజేపీ చీఫ్‌గా మనోజ్ తివారి ఎగ్జిట్ అవ్వడానికి సంబంధించినది’ అని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మనోజ్ తివారికి బీజేపీ చీఫ్ పదవి ఊడుతుందని తెలిపారు. తాము మరోసారి విజయఢంకా మోగించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీని షాక్‌కు గురిచేసేలా ఫలితాలుంటాయని వెల్లడించారు. హిందుత్వం అంటే అందరితో కలిసుండటమేనన్న విషయాన్ని హిందూ ఓటర్లు మరోసారి నిరూపిస్తారని తెలిపారు. కాగా, ఆప్‌కే పట్టం కట్టిన ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌ అంచానాలన్నీ తలకిందులు చేస్తూ, ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందని మనోజ్ తివారీ ట్వీట్టర్ వేదికగా ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News