‘ఎన్పీఆర్‌’కు ఎలాంటి ధృవీకరణ పత్రాలు అక్కర్లేదు

ఎన్పీఆర్(దేశవ్యాప్త జనగణనకు) ఎలాంటి ధృవీకరణ ప్రతాలు అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్ల‌పై పెద్దల సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు లెవనెత్తిన ప్రశ్నకు ఈ విధంగా సమాధాన మిచ్చారు. బుధవారం లోక్‌సభలో ఢిల్లీ అల్లర్లపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా నేడు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. దేశరాజధానిలో జరిగిన మారణకాండకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఏఐఎంఐఎం లీడర్ వారిస్ పఠాన్‌లు కారణమని తేల్చిచెప్పారు. సీఏఏ […]

Update: 2020-03-12 10:49 GMT

ఎన్పీఆర్(దేశవ్యాప్త జనగణనకు) ఎలాంటి ధృవీకరణ ప్రతాలు అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్ల‌పై పెద్దల సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు లెవనెత్తిన ప్రశ్నకు ఈ విధంగా సమాధాన మిచ్చారు. బుధవారం లోక్‌సభలో ఢిల్లీ అల్లర్లపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా నేడు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. దేశరాజధానిలో జరిగిన మారణకాండకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఏఐఎంఐఎం లీడర్ వారిస్ పఠాన్‌లు కారణమని తేల్చిచెప్పారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను తమ ప్రసంగాలతో వీరు రెచ్చగొట్టడంతోనే హింస చెలరేగిందన్నారు. సీఏఏ వలన భారతీయ ముస్లింలకు ఎలాంటి నష్టం వాటిల్లదని, విపక్షాలు కావాలనే సాధారణ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. సోనియా గాంధీ సీఏఏపై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 19న షాహిగ్ బాగ్‌లో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టారన్నారు. సీఏఏలో భారతీయ ముస్లిములకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నట్టు ఎక్కడ రాసి ఉందో, ఏ క్లాజులో ఉందో తనకు చూపించాలని అమిత్ షా ప్రతిపక్ష, విపక్ష సభ్యులను ప్రశ్నించారు. సీఏఏ అనేది పూర్తిగా మన పొరుగున ఉన్న ముస్లిం దేశాల్లో మతపరంగా ఇబ్బందులు పడుతున్నవారికోసమే అని మరోసారి స్పష్టంచేశారు. ఢిల్లీ అల్లర్లకు బీజేపీ పార్టీ, నాయకులు కారణమని ప్రచారం చేస్తున్నారని, 76శాతం అల్లర్లు, మారణహోమాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని వాటిని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. దేశంలో తమకు నచ్చని అంశాల పట్ల నిరసన తెలిపే హక్కు ప్రజలందరికి ఉందన్నారు. కానీ, తమ నిరసనలను శాంతియుతంగా తెలపాలని దేశ శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ఉండొద్దన్నారు. అంతేకాకుండా సాధారణ ప్రజలను రెచ్చగొడుతూ, అల్లర్లను ప్రోత్సహిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. ఢిల్లీ అల్లర్లపై ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదు చేశామని, హింసాకాండకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ కుట్రకు తెరలేపిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, వారికి ఆర్థికంగా ఎవరైతే సాయం చేస్తున్నారో వారిని కూడా వదిలిపెట్టేది లేదని అమిత్ షా హెచ్చరించారు.

Tags: anti caa ryali, delhi riots, central home minister amit shah, congress resn for deaths

Tags:    

Similar News