అమీర్.. క్రాకర్స్ కాల్చొద్దంటున్నావ్.. నమాజ్, అజాన్‌తో ఇబ్బందులు లేవా?: బీజేపీ ఎంపీ
దిశ, సినిమా: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ న్యూ టీవీసీ యాడ్‌తో ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. అడ్వర్‌టైజ్మెంట్‌లో క్రాకర్స్ గురించి పిల్లలకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన అమీర్.. ఒకవేళ మ్యాచ్ గెలిస్తే క్రాకర్స్ పేలుద్దామని, కానీ రోడ్డుమీద కాకుండా ఇంట్లో పటాకులు కాలుద్దామని చెప్తాడు. రోడ్డు.. వాహనాలు నడిపేందుకే కానీ పటాకులు కాల్చేందుకు కాదని వివరిస్తాడు. దీనిపై ఫైర్ అయిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే.. TVC Ceat టైర్స్ ఎండీ, సీఈఓకు లేఖ రాశారు. ‘మీ […]
దిశ, సినిమా: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ న్యూ టీవీసీ యాడ్‌తో ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. అడ్వర్‌టైజ్మెంట్‌లో క్రాకర్స్ గురించి పిల్లలకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన అమీర్.. ఒకవేళ మ్యాచ్ గెలిస్తే క్రాకర్స్ పేలుద్దామని, కానీ రోడ్డుమీద కాకుండా ఇంట్లో పటాకులు కాలుద్దామని చెప్తాడు. రోడ్డు.. వాహనాలు నడిపేందుకే కానీ పటాకులు కాల్చేందుకు కాదని వివరిస్తాడు. దీనిపై ఫైర్ అయిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే.. TVC Ceat టైర్స్ ఎండీ, సీఈఓకు లేఖ రాశారు. ‘మీ కంపెనీ కొత్త యాడ్‌లో రోడ్డుపై క్రాకర్స్ పేల్చొద్దని ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చారు. ఇందుకు మీకు అభినందనలు. అయితే ప్రజలు రోడ్లపై మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. దాన్ని కూడా అడ్రస్ చేయండి. నమాజ్ పేరుతో ప్రతీ శుక్రవారం, ముస్లింల పండుగలకు రోడ్డు బ్లాక్ చేస్తున్నారు దాని గురించి కూడా యాడ్ చేయండి’ అని సూచించారు. అంతేకాదు రోజూ ఉదయాన్నే మైక్‌లో అజాన్ చదవడం వల్ల నాయిస్ పొల్యూషన్‌తో ప్రజలు ఇన్‌కన్వినియెంట్‌గా ఫీల్ అవుతున్నారు.. దీని గురించి ఏమంటారు అని ప్రశ్నించారు. ‘మీ కంపెనీ ప్రకటన హిందువులలో అశాంతిని సృష్టించిందని’, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.