వరంగల్ లో దారుణం.. రాళ్లతో ఓ మహిళను కొట్టి చంపారు
దిశ, వరంగల్: ప్రపంచం ఆధునికంగా అభివృద్ధిలో దూసుకుపోతోన్నది. కానీ, కొంతమంది మాత్రం మానవీయతను కోల్పోయి పైసలు, ఆస్తులే పరమావధిగా భావిస్తూ ఎదుటి వ్యక్తుల ప్రాణాలను బలిగొంటున్నారు. భూమి కౌలు వివాదం ఓ మహిళను బలిగొంది. విషయమేమిటంటే.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో పోసారపు రాజయ్యకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన మల్లయ్య కౌలు చేస్తున్నాడు. ఇటీవల అదే భూమిని రాజయ్య తన కూతురు లత(36) అప్పగించాడు. ఈ విషయమై కొద్ది రోజులుగా రాజయ్య, […]
దిశ, వరంగల్: ప్రపంచం ఆధునికంగా అభివృద్ధిలో దూసుకుపోతోన్నది. కానీ, కొంతమంది మాత్రం మానవీయతను కోల్పోయి పైసలు, ఆస్తులే పరమావధిగా భావిస్తూ ఎదుటి వ్యక్తుల ప్రాణాలను బలిగొంటున్నారు. భూమి కౌలు వివాదం ఓ మహిళను బలిగొంది.
విషయమేమిటంటే.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో పోసారపు రాజయ్యకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన మల్లయ్య కౌలు చేస్తున్నాడు. ఇటీవల అదే భూమిని రాజయ్య తన కూతురు లత(36) అప్పగించాడు. ఈ విషయమై కొద్ది రోజులుగా రాజయ్య, మల్లయ్య కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున మల్లయ్య సంబంధీకులు రాళ్లతో దాడి చేయడంతో లత తీవ్రంగా గాయపడింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.