108 వాహనంలో అలా.. చేసిన మహిళ

దిశ, కోదాడ: 108 వాహనంలోనే ఓ మహిళ ప్రసవించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన గర్భిణీ మమతకు పురిటి నొప్పులు వస్తుండగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది స్పందించి అక్కడి చేరుకున్నారు. అనంతరం ఆమెను108 వాహనంలో కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. మార్గమధ్యలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్య సిబ్బందితోపాటు 108 సిబ్బంది తోడ్పాటును అందించి తల్లీబిడ్డలు క్షేమంగా […]

Update: 2021-10-10 09:33 GMT
Ambuelence1
  • whatsapp icon

దిశ, కోదాడ: 108 వాహనంలోనే ఓ మహిళ ప్రసవించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన గర్భిణీ మమతకు పురిటి నొప్పులు వస్తుండగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది స్పందించి అక్కడి చేరుకున్నారు. అనంతరం ఆమెను108 వాహనంలో కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. మార్గమధ్యలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్య సిబ్బందితోపాటు 108 సిబ్బంది తోడ్పాటును అందించి తల్లీబిడ్డలు క్షేమంగా ఉండేలా సహకరించారు. సహకరించినవారిలో ఈఎమ్టీఎమ్ నాగేశ్వరరావు, పైలెట్ బి. రాంబాబు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News