టోకెన్ ఇవ్వమంటే కిటికీతో వేలు తెగ్గొట్టారు
దిశ ప్రతినిధి, నల్లగొండ: వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన ఓ మహిళా రైతు వేలు తెగిపోయింది. ధాన్యం విక్రయానికొచ్చిన రైతు వేలు ఎలా పోగొట్టుకుందని ఆశ్యర్యపోతున్నారా.. కానీ ఈ దారుణం నిజం. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు టోకెన్ కోసం వచ్చింది ఓ మహిళ. అయితే, మార్కెట్ యార్డులో భారీగా జనాలు ఉన్నారు. రైతులు టోకెన్ల కోసం లైన్‌లోనే గంటల తరబడి వేచి ఉన్నారు. అదే క్యూలో ఉన్న మహిళా […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన ఓ మహిళా రైతు వేలు తెగిపోయింది. ధాన్యం విక్రయానికొచ్చిన రైతు వేలు ఎలా పోగొట్టుకుందని ఆశ్యర్యపోతున్నారా.. కానీ ఈ దారుణం నిజం.
సూర్యాపేట జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు టోకెన్ కోసం వచ్చింది ఓ మహిళ. అయితే, మార్కెట్ యార్డులో భారీగా జనాలు ఉన్నారు. రైతులు టోకెన్ల కోసం లైన్‌లోనే గంటల తరబడి వేచి ఉన్నారు. అదే క్యూలో ఉన్న మహిళా రైతు తీరా కౌంటర్ వద్దకు రాగానే మార్కెట్ అధికారులు కిటికీ మూసివేసేందుకు ప్రయత్నించారు.
ఇదే సమయంలో బాధితురాలు చేతివేళ్లను కిటికీ వద్దనే ఉంచి లైన్‌లోనే ఉంది. కానీ, అధికారులు బలంగా కిటికీలు వేయడంతో ఒక్కసారిగా వేలు ఊడిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, గంటల తరబడి లైన్లలో వేచి ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చే సమయంలో అధికారులు దురుసుతనం మంచిదికాదని రైతులు చెబుతున్నారు. ఇటువంటి అనర్థాలు అయిన తమను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.