సర్కారు స్కూలుకు కరోనా కిట్ వితరణ

దిశ, కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా మహమ్మారి నివారణకు తెలంగాణ అట్లాంటా సొసైటీ తనవంతు బాధ్యతను నెరవేర్చే పనిలో నిమగ్నం అయింది. మంగళవారం కరీంనగర్ సుభాష్‌నగర్ ప్రభుత్వ హైస్కూల్‌కు థర్మల్ స్క్రీనింగ్ గన్, శానిటైజర్ స్ప్రే గన్, 10 లీటర్ల శానిటైజర్, 10 లీటర్ల సోడియం హైపో క్లోరైడ్ లిక్విడ్ అందజేశారు. సొసైటీ ప్రెసిడెంట్ రాహుల్ చికాయల, చైర్మన్ అనిత నెల్లుట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు డైరెక్టర్ల సహకారంతో వీటిని అందజేశారు. అట్లాంటాకు చెందిన మహేష్ నీలగిరి, ప్రభాకర్ […]

Update: 2020-08-11 07:34 GMT
సర్కారు స్కూలుకు కరోనా కిట్ వితరణ
  • whatsapp icon

దిశ, కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా మహమ్మారి నివారణకు తెలంగాణ అట్లాంటా సొసైటీ తనవంతు బాధ్యతను నెరవేర్చే పనిలో నిమగ్నం అయింది. మంగళవారం కరీంనగర్ సుభాష్‌నగర్ ప్రభుత్వ హైస్కూల్‌కు థర్మల్ స్క్రీనింగ్ గన్, శానిటైజర్ స్ప్రే గన్, 10 లీటర్ల శానిటైజర్, 10 లీటర్ల సోడియం హైపో క్లోరైడ్ లిక్విడ్ అందజేశారు. సొసైటీ ప్రెసిడెంట్ రాహుల్ చికాయల, చైర్మన్ అనిత నెల్లుట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు డైరెక్టర్ల సహకారంతో వీటిని అందజేశారు. అట్లాంటాకు చెందిన మహేష్ నీలగిరి, ప్రభాకర్ రెడ్డి బోయపల్లి, అనిల్ నీలగిరిలు ఆర్థిక సాయం అందజేసినట్టు తెలిపారు.

Tags:    

Similar News