కూతురికి వాతలు పెట్టిన కేసులో ట్విస్ట్
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా కదిరిలో నాలుగేళ్ల కూతురికి తల్లి వాతలు పెట్టిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు అదుపులో ఉన్న మహిళ విచారణలో కూతురును అమ్మేసినట్లు తెలిపింది. ఆరునెలల కితం కూతురిని రూ.50వేలకు అమ్మినట్లు పోలీసులకు వెల్లడించింది. అయితే ఎవరికి పాపను అమ్మారు, వారి వివరాలు చెప్పాలని పోలీసులు అడగ్గా.. వారు ఎవరో నాకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి విషయాన్ని దాటవేస్తూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు బాలికకు వాతలు […]
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా కదిరిలో నాలుగేళ్ల కూతురికి తల్లి వాతలు పెట్టిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు అదుపులో ఉన్న మహిళ విచారణలో కూతురును అమ్మేసినట్లు తెలిపింది. ఆరునెలల కితం కూతురిని రూ.50వేలకు అమ్మినట్లు పోలీసులకు వెల్లడించింది. అయితే ఎవరికి పాపను అమ్మారు, వారి వివరాలు చెప్పాలని పోలీసులు అడగ్గా.. వారు ఎవరో నాకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి విషయాన్ని దాటవేస్తూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం.
మరోవైపు బాలికకు వాతలు పెట్టిన కేసుకు సంబంధించి కూడా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తల్లే.. కూతురికి వాతలు పెట్టిందా లేకుంటే ఆమెకు ఎవరైనా సహకరించారా అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఆ మహిళ రెండో భర్త పాత్ర ఉందా లేదా అన్నదానిపై విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై స్థానికులు సైతం ఆగ్రహంగా ఉండగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.