కేవలం ఆ కోరికలు తీర్చుకోవడానికే.. ఆన్‌లైన్‌లో వెతుకుతున్న 42 శాతంమంది

ఒకప్పుడు చాలా కాలంగా పరిచయస్తులైన వ్యక్తుల మధ్య మాత్రమే పర్సనల్ రిలేషన్స్ ఏర్పడేవి. ప్రేమలు కూడా అలాగే పుట్టుకొచ్చేవి. కానీ

Update: 2024-01-06 10:30 GMT

దిశ, ఫీచర్స్ ఒకప్పుడు చాలా కాలంగా పరిచయస్తులైన వ్యక్తుల మధ్య మాత్రమే పర్సనల్ రిలేషన్స్ ఏర్పడేవి. ప్రేమలు కూడా అలాగే పుట్టుకొచ్చేవి. కానీఒకప్పుడు చాలా కాలంగా పరిచయస్తులైన వ్యక్తుల మధ్య మాత్రమే పర్సనల్ రిలేషన్స్ ఏర్పడేవి. ప్రేమలు కూడా అలాగే పుట్టుకొచ్చేవి. కానీ ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా ఆ ట్రెండ్ కాస్త మారింది. ప్రేమలు, లైంగిక సంబంధాల విషయంలో సుదీర్ఘకాలంగా పరిచయాలే ఉండనవసరం లేదు. సోషల్ మీడియా వేదికలు, డేంటింగ్ యాప్‌లు ప్రస్తుతం ఆ పనిని సులభతరం చేస్తున్నాయి. ఒక్కసారి వాటిలోకి ఎంటరైతే కావాల్సిన సమాచారమే కాకుండా, వ్యక్తిగత అవసరాలు, ఆసక్తులను బట్టి సర్వీసు అందించే వేదికలు కూడా చాలా ఉంటున్నాయని యూఎస్ కేంద్రంగా ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆన్‌లైన్ కేంద్రంగా ఎన్నడూ పరిచయం లేని వ్యక్తితో క్షణాల్లో బంధాలు పెనవేసుకుపోతున్న పరిస్థితులు కళ్లముందు కదులుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇండియాలో తక్కువగానీ ఫారెన్ కంట్రీస్‌లో అయితే న్యూ జనరేషన్ తమ పర్మినెంట్ పార్టనర్స్‌ను సెలెక్ట్ చేసుకోవడానికి, టెంపరరీగా సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువగా డేటింగ్ యాప్‌లను, సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నట్లు ప్యూ రీసెర్చ్ సర్వే పేర్కొన్నది.

నచ్చిన లైఫ్ పార్టనర్ లేదా టెంపరరీ సెక్సువల్ పార్టనర్‌ను ఎంపిక చేసుకునేందుకు ప్రతి 10 మందిలో ముగ్గురు డేటింగ్ సైట్స్, సోషల్ మీడియాతోపాటు వివిధ యాప్‌లను యూజ్ చేస్తున్నట్లు ప్యూ రీసెర్చ్ సర్వే పేర్కొంటున్నది. అంతేకాదు 24 ఏండ్లు పైబడిన వారిలో సగం కంటే ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఒక్కసారైనా తమకు సెట్ అయ్యే లైంగిక భాగస్వామికోసం వెతుకున్నారట. ఇక 16 శాతం మంది యూఎస్ అడల్ట్స్ అయితే తాము డేటింగ్ సైట్స్ లేదా యాప్‌‌ల ద్వారా నచ్చిన భాగస్వామిని ఎంచుకుంటామని చెప్తున్నారు. ఇక న్యూ జనరేషన్ అయితే లవ్, సెక్స్, డేటింగ్,పెళ్లి, ఎమోషనల్ వంటి అనేక విషయాలను ఆన్‌లైన్ వేదికగా డిస్కస్ చేస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పెళ్లయిన వారిలో లేదా ఇప్పటికే లైంగిక భాగస్వామిని కలిగి ఉన్నవారిలో కూడా 42 శాతం మంది కేవలం అదనపు లైంగిక సంబంధాలు నెరపడానికి మాత్రమే డేటింగ్ సైట్‌లు, యాప్‌లు, సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో 30 ఏండ్లలోపు ఏజ్ కలిగిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇక 22 శాతం మంది సాధారణంగా డేటింగ్ చేయాలని మాత్రమే అనుకుంటున్నారట. 24 శాతం మంది బ్యాచిలర్స్ ఓన్లీ సెక్స్ కోరికలు తీర్చుకునే ఉద్దేశంతోనే ఆన్ లైన్‌లో తగిన పార్టనర్ కోసం వెతుకుతున్నారు. కాగా 21 శాతం మంది నిజాయితీగా ఫ్రెండ్‌షిప్ చేయగలిగే వారికోసం సోషల్ మీడియాలో వెతుకుతున్నారు.


Similar News