అదుపు లేకుండా పోయింది.. నిర్వాహకులపై కేసులు పెట్టాలి
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఉన్న బెల్టుషాపుల నిర్వాహాకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మండలంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, దీని మూలంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టుషాపులకు అడ్డు అదుపు లేకుండా పోయాయని వెంటనే […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఉన్న బెల్టుషాపుల నిర్వాహాకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మండలంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, దీని మూలంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టుషాపులకు అడ్డు అదుపు లేకుండా పోయాయని వెంటనే బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.