అక్టోబర్​ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగంపై పోరు కార్యక్రమం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దళిత, గిరిజన సమస్యలపై పోరాటంలో విజయం సాధించామని, ఇక మా తర్వాత పోరు నిరుద్యోగ సమస్యపేనే అని కాంగ్రెస్ సీనియర్​ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. గాంధీభవన్ లో పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగంపై పోరును అక్టోబర్​2వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ చివరి సభకు సోనియాను కానీ రాహుల్ ను కానీ తీసుకురావాలనే […]

Update: 2021-09-18 10:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దళిత, గిరిజన సమస్యలపై పోరాటంలో విజయం సాధించామని, ఇక మా తర్వాత పోరు నిరుద్యోగ సమస్యపేనే అని కాంగ్రెస్ సీనియర్​ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. గాంధీభవన్ లో పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగంపై పోరును అక్టోబర్​2వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ చివరి సభకు సోనియాను కానీ రాహుల్ ను కానీ తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నట్లు చెప్పారు. యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో పర్యటించాలని, నిరుద్యోగులు, యువతను, మేధావులను కలవాలని భావిస్తున్నట్లు మల్లు రవి స్పష్టం చేశారు. సభ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, చివరి సభ ఎక్కడ అనే అంశంపై చర్చించాల్సి ఉందన్నారు.

ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ 11 రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేస్తుందన్నారు. ఈ నెల 22న నిరుద్యోగ సమస్యపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. 27 భారత్ బంద్ ఉందన్నారు. ఆదివారం గాంధీ భవన్ లో ప్రతిపక్ష నేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ జంగ్ సైరన్ మోగించనుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్​, నోటిఫికేషన్లు లేక విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వారికోసం పోరాటాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ వైస్​ చైర్మన్ అంజాతుల్లా మాట్లాడుతూ.. సిరిసిల్ల నుంచే ఈ నిరుద్యోగ ధర్మ యుద్ధం ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News